E20 Petrol | ఈ20 పెట్రోల్‌తోనే మైలేజీ తగ్గదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
E20 Petrol | ఈ20 పెట్రోల్ వినియోగంతోనే వాహనాల మైలేజీ తగ్గుతుందని చెప్పలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితుల్లో పెట్రోల్ వినియోగం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. డ్రైవింగ్ విధానం, ట్రాఫిక్ పరిస్థితులు, వెహికిల్ నిర్వహణ, టైర్లలో గాలి ఒత్తిడి, ఏసీ వినియోగం వంటి అంశాలు మైలేజీపై ప్రభావం చూపుతాయని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది.
- డ్రైవింగ్ తీరు, ట్రాఫిక్, టైర్ ప్రెజర్, ఏసీ వినియోగంతోనూ ప్రభావం
- ఈ20పై విస్తృతంగా పరీక్షలు నిర్వహించామని పెట్రోలియం శాఖ వెల్లడి
E20 Petrol | ఈ20 పెట్రోల్ వినియోగంతోనే వాహనాల మైలేజీ తగ్గుతుందని చెప్పలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితుల్లో పెట్రోల్ వినియోగం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. డ్రైవింగ్ విధానం, ట్రాఫిక్ పరిస్థితులు, వెహికిల్ నిర్వహణ, టైర్లలో గాలి ఒత్తిడి, ఏసీ వినియోగం వంటి అంశాలు మైలేజీపై ప్రభావం చూపుతాయని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ20 పెట్రోల్‌పై విస్తృతంగా పరీక్షలు, ప్రమాణీకరణ ప్రక్రియ పూర్తిచేశామని పేర్కొంది. వాహనం మైలేజీ ఇంధనంపై మాత్రమే ఆధారపడదని.. వాహనం నడిపే విధానం, దాని మొత్తం పరిస్థితి సైతం కీలకమని వివరించింది. ఇటీవల వాహనదారుల్లో ఈ20 పెట్రోల్ వల్ల మైలేజీ, వాహన పనితీరు, అనుకూలతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. కొన్ని వాహనాల్లో ఈ20 వినియోగం వల్ల ఇంధన సామర్థ్యం 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని గతంలో ప్రభుత్వం అంగీకరించింది. అయితే, వాస్తవ వినియోగంలో మైలేజీని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయని తెలిపింది.
కల్తీపై ఆధారాలు లేవు
ఈ20 పెట్రోల్‌లో అధిక స్థాయిలో క్లోరైడ్, తేమ ఉన్నాయన్న ఆరోపణలకు ఆధారాలు లేవని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వెల్లడించాయి. దేశవ్యాప్తంగా రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి మిలియన్‌కు ఒక భాగం (పీపీఎం), అంతకంటే తక్కువగా నమోదైందని తెలిపాయి. 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాలు, డిపోలు-టెర్మినల్స్ నుంచి తీసుకున్న 80కిపైగా ఈ20 నమూనాల్లోనూ క్లోరైడ్ స్థాయి నిర్దేశిత 3 పీపీఎం పరిమితిలోనే ఉన్నట్లు సంస్థలు పేర్కొన్నాయి. దాదాపు 90వేల పెట్రోల్ బంకుల్లోని భూగర్భ నిల్వ ట్యాంకులను తనిఖీ చేసినప్పటికీ నీరు చేరినట్లు ఎక్కడా గుర్తించలేదని తెలిపాయి. రిటైల్ ఔట్‌లెట్లలో చమురు సంస్థలు కఠిన తనిఖీలు నిర్వహించాయని, ఇందులో ఇంధన కల్తీకి సంబంధించిన కొన్ని స్వల్ప ఘటనలు మాత్రమే గుర్తించామని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ
- ●Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్

Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ

Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్



