ICC Men’s ODI World Cup | గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్ షురూ..
ICC Men's ODI World Cup | అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ప్రత్యేక సందర్భానికి రంగం సిద్ధమవుతోంది. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌ను అక్టోబర్ 2న ప్రారంభించే ప్రతిపాదనను ఐసీసీ పరిశీలిస్తోంది. అదే రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కావడంతో.. ఆయనకు నివాళిగా మెగా టోర్నీని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
- అక్టోబర్ 2న ప్రారంభించేందుకు ఐసీసీ ఏర్పాట్లు
- మహాత్ముడికి ఘన నివాళులర్పించాలని యోచన
- సంయుక్త ఆతిథ్యంగా ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా
ICC Men's ODI World Cup | అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ప్రత్యేక సందర్భానికి రంగం సిద్ధమవుతోంది. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌ను అక్టోబర్ 2న ప్రారంభించే ప్రతిపాదనను ఐసీసీ పరిశీలిస్తోంది. అదే రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కావడంతో.. ఆయనకు నివాళిగా మెగా టోర్నీని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఈసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
దక్షిణాఫ్రికాతో అనుబంధం..
దక్షిణాఫ్రికాతో గాంధీజీకి ఉన్న చారిత్రక అనుబంధం ఉండడంతో ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 1893 నుంచి 1914 వరకు సుమారు 21 ఏళ్లపాటు దక్షిణాఫ్రికాలో ఉన్న ఆయన.. అక్కడే వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. సత్యాగ్రహానికి కూడా అక్కడే పునాది పడింది. అనంతరం నెల్సన్ మండేలా వర్ణవివక్షపై సాగించిన పోరాటంతో గాంధీ సిద్ధాంతాలకు ఏర్పడిన చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేస్తూ.. ఆయన జయంతి రోజున ప్రపంచకప్‌కు తెరతీయాలని ఆతిథ్య దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి.
14 జట్లతో పోరు
2027 ప్రపంచకప్‌లో గతంతో పోలిస్తే ఫార్మాట్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత ప్రపంచకప్‌లో 10 జట్లు బరిలోకి దిగగా.. ఈసారి 14 జట్లకు అవకాశం కల్పించనున్నారు. ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు తదుపరి ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. 2003 ప్రపంచకప్‌లో అమలు చేసిన విధానాన్ని మరోసారి తీసుకొస్తున్నారు. టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా చోటు దక్కనుండగా.. నమీబియా క్వాలిఫయింగ్ ప్రక్రియ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. మొత్తం 54 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌తో పాటు హరారే, విండ్‌హోక్ తదితర నగరాలు మ్యాచ్‌లకు వేదికలు కానున్నాయి.
త్వరలో షెడ్యూల్‌పై స్పష్టత..
అయితే, ప్రపంచకప్ ప్రారంభ తేదీపై ఇంకా తుది నిర్ణయం వెల్లడి కాలేదు. ప్రసార హక్కులు, మ్యాచ్‌ల నిర్వహణ, షెడ్యూల్ తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. అక్టోబర్ 2న మొదలయ్యే ప్రపంచకప్ దాదాపు ఏడు వారాల పాటు సాగనుంది. గాంధీ జయంతి రోజున క్రికెట్ ప్రపంచకప్‌కు శ్రీకారం చుట్టడం జరిగితే.. మహాత్ముడి జ్ఞాపకాలకు క్రీడా వేదికగా మరో ప్రత్యేక గౌరవం దక్కినట్లవుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్
అక్టోబర్ 1, 2026

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..
అక్టోబర్ 1, 2026

CM Revanth Reddy | సిరిసిల్లలో గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రిని చేస్తా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక
- ●Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్
- ●Chinese Manja Ban Hyderabad | చైనా మాంజా అమ్మితే కటకటాలకే: వ్యాపారులకు హైదరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక.. అడ్వాన్సులు ఇస్తే అంతే సంగతులు
- ●Telangana Cabinet Decisions October 1 | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 డీఏల మంజూరు: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
- ●Telangana CEO Form 6 Declaration | ఓటర్లకు సీఈవో కీలక ఆదేశాలు: ఆ ఒక్కటి లేకుంటే ఓటు కట్
- ●Gadwal Vijayalakshmi Cabinet Meeting | సచివాలయంలో కేబినెట్ హాల్లోకి గద్వాల విజయలక్ష్మికి నో ఎంట్రీ.. సీఎంవో అధికారుల సమాధానంతో షాక్

Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక

Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్

Chinese Manja Ban Hyderabad | చైనా మాంజా అమ్మితే కటకటాలకే: వ్యాపారులకు హైదరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక.. అడ్వాన్సులు ఇస్తే అంతే సంగతులు

Telangana Cabinet Decisions October 1 | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 డీఏల మంజూరు: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!



