Tamannaah | తమన్నాకు షాక్ – మిల్కీ బ్యూటీకి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టు తీర్పు
ఓ నష్టపరిహారం కేసులో తమన్నాకు మద్రాస్ హైకోర్టు పెద్ద షాకిచ్చింది. తన ఫొటోలను అక్రమంగా ఓ సంస్థ వాడుకుంటున్నదంటూ తమన్నా 2017లో కేసు వేసింది. కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో కోర్టు తమన్నాకు వ్యతిరేకంగా తీర్చు ఇచ్చింది.
Entertainment | Published On Apr 16, 2026, 5.08 pm IST
Tamannaah | సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా తమన్నా భారీగా సంపాదిస్తోంది. ఒక్కో సినిమాకు ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. అలాగే ఒక్కో యాడ్ చేయడానికి మూడు కోట్ల వరకు స్వీకరిస్తుందట. యంగ్ హీరోయిన్ల ఎంత మంది వచ్చినా తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది.
మద్రాస్ హైకోర్టు...
తాజాగా గతంలో చేసిన ఓ యాడ్‌కు సంబంధించి తమన్నాకు కోర్టు పెద్ద షాకిచ్చింది. హీరోయిన్‌గా మంచి బిజీగా ఉన్న టైమ్‌లో పవర్ సోప్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి తమన్నా అంగీకరించింది. ఏడాది పాటు సంస్థ తయారు చేసే ప్రొడక్ట్స్‌పై తన ఫొటోలను వాడుకునేలా తమన్నా అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
కానీ అగ్రిమెంట్ గడువు పూర్తయినా కూడా తమ ప్రొడక్ట్స్‌పై పవర్ సోప్స్ సంస్థ తన ఫొటోలనే వాడుకుంటున్నాదంటూ తమన్నా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ఉల్లంఘించిడమే కాకుండా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసినందుకు కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలంటూ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది.
గడువు ముగిసినా....
గడువు ముగిసిన తర్వాత కూడా తమన్నా ఫొటో సంస్థ వాడుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని ఈ కేసులో కోర్టు తీర్పు చెప్పింది. మిల్కీ బ్యూటీ తరుపు లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఊహాజనిత కథనాలతో నష్టపరిహారం చెల్లించడం కుదరదంటూ తీర్పు ఇచ్చింది. 2017లో కేసు వేయగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసులో కోర్టు తీర్పు చెప్పింది.ప్రస్తుతం తమన్నా హిందీలో వ్వాన్ సినిమా చేస్తోంది. తమిళంలో పురుషన్ పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోంది.
సంబంధిత వార్తలు

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Madras High Court | చిక్కుల్లో మాజీ మంత్రి బాలాజీ.. ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..!
ఏప్రిల్ 29, 2026

TVK Vijay Election Affidavit | ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్.. రూ.100 కోట్ల ఆస్తుల వ్యవహారంలో హైకోర్టు నోటీసులు
ఏప్రిల్ 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



