త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ – వీరిద్ద‌రు క‌లిసి చేసిన‌ ఫోక్ సాంగ్స్ ఇవే

ఫోక్ సింగ‌ర్స్ ఈశ్వ‌ర్ సాయి, మాధురి రాథోడ్ క‌లిసి న‌టించిన రాయే ల‌చ్చిమి పాట ఇటీవ‌లే రిలీజైంది. ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ సాంగ్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. ఈ పాట కంటే ముందు వీరిద్ద‌రి క‌లిసి న‌టించిన ఫోక్ సాంగ్స్ ఏవంటే?

N

Entertainment | Published On Aug 20, 2026, 5.42 pm IST

Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ – వీరిద్ద‌రు క‌లిసి చేసిన‌ ఫోక్ సాంగ్స్ ఇవే
Advertisement

Madhuri Rathod | ఫోక్ సాంగ్స్‌తో తెలుగునాట‌ ఫేమ‌స్ అయ్యారు ఈశ్వ‌ర్ సాయి, మాధురి రాథోడ్ . ప్ర‌స్తుతం వీరిద్ద‌రి పేర్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈశ్వ‌ర్ సాయి, మాధురి రాథోడ్ క‌లిసి రాయ‌ల‌చ్చిమి అనే ఫోక్ వీడియో సాంగ్ న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సాంగ్‌లో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జి శివకుమారి నాయుడు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ పాట‌కు నవీన్ జే సంగీతం అందించారు. తాడూరి జయరాజ్ సాహిత్యం స‌మ‌కూర్చారు. ప్రభ , రాము పాడిన రాయే లచ్చిమి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ తెలుగు సాంగ్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది.

బాసింగా బ‌లాలే ...

రాయే ల‌చ్చిమి కంటే ముందు ఈశ్వ‌ర్‌సాయి, మాధురి రాథోడ్ ప‌లు ఫోక్స్ సాంగ్స్‌లో క‌లిసి న‌టించారు. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బాసింగా బ‌లాలే పెద్ద హిట్ట‌య్యింది. యూట్యూబ్‌లో తొంభై మిలియ‌న్ల వ‌ర‌కు వ్యూస్ ద‌క్కించుకుంది. అది అబ్బ‌బ్బా గా పోరి, క‌ళ్ల‌కు కాటుక దిద్దినారో, స‌న్న స‌న్న బియ్య‌మే, సిటీ చీర‌, రాతిరి రాతిరి రాతిరిలో తో పాటు ఈశ్వ‌ర్ సాయి, మాధురి రాథోడ్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన పాట‌ల‌న్నీ ఫోక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించాయి.

భార్య ఆరోప‌ణ‌లు....

ఈశ్వ‌ర్ సాయితో మాధురి రాథోడ్ వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తుందంటూ వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. వీరిద్ద‌రు వేమ‌ల‌వాడ‌లోని రెడ్డి భ‌వ‌న్‌లో ఒకే గ‌దిలో ఉండ‌గా...ఈశ్వ‌ర్ సాయి భార్య వ‌చ్చి ప‌ట్టుకున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. త‌న భ‌ర్త‌ను మాధురి లొంగ‌దీసుకుంద‌ని, కాపురాన్ని కూల్చివేసిందంటూ ఆరోప‌ణ‌లు చేసింది. ఫోక్ సింగ‌ర్‌, డ్యాన్స‌ర్‌గానే కాకుండా సోష‌ల్ మీడియాలో మాధురి రాథోడ్‌కు చాలానే ఫాలోయింగ్ ఉంది. ప‌లు ఫోక్స్ సాంగ్స్‌ను ప‌డింది. ఆమె ఆల‌పించిన నిమ్మ తోట వ‌న‌ములో పెద్ద హిట్ట‌య్యింది.

;

Advertisement
Advertisement