OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ – బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ
మాధవన్ హీరోగా నటించిన బయోపిక్ మూవీ జీడీఎన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇండియన్ సైంటిస్ట్ జీడీ నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో ప్రియమణి, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు.
Entertainment | Published On Sep 1, 2026, 7.57 pm IST
OTT | వెర్సటైల్ యాక్టర్ మాధవన్ హీరోగా నటించిన బయోపిక్ మూవీ జీడీఎన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఇండియన్ ఎడిసన్‌గా పేరు తెచ్చుకున్న భారతీయ శాస్త్రవేత్త జీడీ నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ బయోపిక్‌లో దుషారా విజయన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.
పదిహేను కోట్లతో తీస్తే...
కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్‌లో సత్యరాజ్, జయరామ్, వినయ్ రాయ్, అదితి బాలన్ కీలక పాత్రల్లో నటించారు. నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నంగా జీడీఎన్ ప్రేక్షకులను మెప్పించింది. కానీ కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని సాధించలేకపోయింది. పదిహేను కోట్లతో రూపొందిన ఈ మూవీ కేవలం ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
జీడీఎన్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.బ్రిటీష్ పాలనలో గొప్ప సైంటిస్ట్‌గా జీడీ నాయుడు పేరు తెచ్చుకుంటాడు. అతడి ఎదుగుదలను చూసి ఓర్వలేక పోయిన తెల్లదొరలు పన్నులు ఎగవేస్తున్నాడంటూ నాయుడు ఆస్తులను దోచుకోవాలని చూస్తారు. హిట్లర్‌తో అతడికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తారు. తెల్లదొరల నిందలను ఎదుర్కొంటూ నాయుడు ఎలా గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
మాధవన్ ట్రాన్స్‌ఫర్మేషన్...
జీడీ నాయుడు పాత్రలో మాధవన్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆయన నటన అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు గాను మాధవన్‌కు ఈ సారి నేషనల్ అవార్డ్ రావడం ఖాయమని తమిళ సినీ వర్గాలు చెబుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay – Trisha | త్రిష సడెన్ ఎంట్రీ – ముఖం చాటేసిన విజయ్ – ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది?
సెప్టెంబర్ 13, 2026

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026

Trisha | దళపతి విజయ్ మీటింగ్ – త్రిష షూటింగ్ – ఇద్దరూ లండన్‌లోనే!
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే
- ●Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయలతోనే అవార్డులు ఇస్తున్నాం
- ●Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు
- ●Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖమ్మ పోతలేదు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్

Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే

Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయలతోనే అవార్డులు ఇస్తున్నాం

Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు



