BB Jodi Season 2 | బీబీ జోడీ సీజన్ 2 విన్నర్స్‌గా మానస్, శ్రష్టి వర్మ – ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ ఎంత దక్కిందంటే?
బీబీ జోడీ సీజన్ 2 విన్నర్స్‌గా మానస్ నాగులపల్లి - శ్రష్టి వర్మ నిలిచారు. ఫైనల్‌లో వీరి పర్ఫార్మెన్స్‌కు గెస్ట్‌తో పాటు జడ్జ్‌లు సైతం ఫిదా అయ్యారు. విజేతలుగా నిలిచిన మానస్, శ్రష్టి వర్మకు పదిహేను లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
Entertainment | Published On Mar 31, 2026, 7.48 pm IST
BB Jodi Season 2 | పదమూడు వారాలు పాటు బుల్లితెర ప్రేక్షకులకు ఉత్కంఠను పంచిన బీబీ జోడీ సీజన్ 2లో మానస్ నాగులపల్లి, శ్రష్టి వర్మ విన్నర్స్‌గా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో తమ డ్యాన్స్‌తో వీరిద్దరు అదరగొట్టారు . అది జ్వాల అనంత జ్వాలతో పాటు అఖండ తాండవం, చిచ్చుబుడ్డి పాటలకు మానస్, శ్రష్టి వర్మ వేసిన స్టెప్పులకు జడ్జ్‌లు సైతం ఫిదా అయ్యారు. చాలా కఠినమైన స్టెప్పులతో వీరిద్దరి పర్ఫార్మెన్స్ సాగింది. ఫైనల్‌లో మానస్, శ్రష్టి వర్మ పర్ఫార్మెన్స్ ముందు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ తేలిపోయారు. దాంతో మానస్, శ్రష్టిలను విజేతలుగా జడ్జ్‌లు ప్రకటించారు.
రన్నరప్స్...
బీబీ జోడీ సీజన్ 2లో విశ్వరాజ్ - నేహా చౌదరి ఫస్ట్ రన్నరప్స్‌గా నిలిచారు. ఫైనల్ వరకు మానస్, శ్రష్టి వర్మకు గట్టి పోటీ ఇచ్చారు. ఫైనల్‌లోనూ అదరగొట్టిన విశ్వరాజ్, నేహాలకు నిరాశే మిగిలింది. సెకండ్ రన్నరప్స్ స్థానంతో అమర్‌దీప్ చౌదరి - నైనిక సరిపెట్టుకున్నారు. నాలుగో స్థానంలో అర్జున్ కళ్యాణ్ - శ్రీసత్య జోడీ నిలిచింది.బీబీ జోడీ టైటిల్ గెలిచిన మానస్, శ్రష్టి వర్మకు భారీగానే ప్రైజ్‌మనీ దక్కింది. బీబీ జోడీ ట్రోఫీతో పాటు పదిహేను లక్షలు సొంతం చేసుకున్నారు.
అర్జున్ గెస్ట్...
బీబీ జోడీ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా సీనియర్ హీరో అర్జున్ అటెండ్ అయ్యారు. ఈ డ్యాన్స్ షోకు హోస్ట్‌గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరించగా...శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్, సదా జడ్జ్‌లుగా వ్యవహరించారు.
బీబీ జోడీ సీజన్ 2లో మొత్తం పన్నెండు జంటలు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ధన్‌రాజ్ - భానుశ్రీ, నాగమణికంఠ - ప్రియాంక సింగ్, సాయి శ్రీనివాస - కిరాక్ సీత, రీతూ చౌదరి - డెమోన్ పవన్ తో పాటు మరికొందరు ఈ షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్ సీజన్ 9లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది శ్రష్టి వర్మ. వారం మాత్రమే హౌజ్‌లో కొనసాగింది. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



