త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maa Inti Bangaram Trailer | డైలాగ్ క‌రెక్ట్‌గా ప‌డితే ఎవ‌డైనా బెద‌రాల్సిందే …స‌మంత యాక్ష‌న్ ట్రీట్‌ – మా ఇంటి బంగారం ట్రైల‌ర్ రిలీజ్‌

స‌మంత హీరోయిన్‌గా న‌టించిన మా ఇంటి బంగారం ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో స‌మంత అద‌ర‌గొట్టేసింది. స‌మంత ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

N

Entertainment | Published On May 25, 2026, 9.11 pm IST

Maa Inti Bangaram Trailer | డైలాగ్ క‌రెక్ట్‌గా ప‌డితే ఎవ‌డైనా బెద‌రాల్సిందే …స‌మంత యాక్ష‌న్ ట్రీట్‌ – మా ఇంటి బంగారం ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Maa Inti Bangaram Trailer |  స‌మంత హీరోయిన్‌గా న‌టించిన మా ఇంటి బంగారం ట్రైల‌ర్ వ‌చ్చేసింది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత స్వ‌యంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. జూన్ 19న మా ఇంటి బంగారం థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సోమ‌వారం రిలీజైన ట్రైల‌ర్‌లో రిస్కీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో స‌మంత అద‌ర‌గొట్టేసింది. నా ప్రాణం అడ్డుపెట్టైనా ..నా ఫ్యామిలీ కి ఏం కాకుండా చూస్కుంటా....హీరో అయినా హౌజ్ వైఫ్ అయినా...డైలాగ్ క‌రెక్ట్‌గా ప‌డిందంటే ఎవ‌డైనా బెద‌రాల్సిందే అంటూ స‌మంత చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. తెలంగాణ యాస‌లో సంభాష‌ణ‌లు చెప్పి ఆక‌ట్టుకుంది. సంతోష్ నారాయ‌ణ‌న్ బీజీఎమ్ ఈ ట్రైల‌ర్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

గ‌ర్వ‌ప‌డేలా ఉంటుంది...

ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స‌మంత మాట్లాడుతూ ‘ నందినీ రెడ్డి, రాజ్ నిడిమోరు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ సంఘటన గానీ ఎదురు కాలేదు. ‘మా ఇంటి బంగారం’లో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా సినిమా ఆక‌ట్టుకుంది. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్న‌ది.

ఎంతో తేడా ఉంది...

ఒకప్పటి సమంతకి ఇప్పటి సమంతకు ఎంతో తేడా ఉంద‌ని, ఇప్పుడు ఆమె నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నార‌ని, యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశార‌ని డైరెక్ట‌ర్ నందిని రెడ్డి పేర్కొన్నారు.
మా ఇంటి బంగారం సినిమాలో దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య, గౌత‌మ్‌, శ్రీముఖి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement