త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aditi Rao Hydari | ల‌స్ట్ స్టోరీస్ 3లో అదితీరావ్ హైద‌రీ – ఈ సారి మ‌రింత బోల్డ్‌గా

ల‌స్ట్ స్టోరీస్ ఆంథాల‌జీ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది. ల‌స్ట్ స్టోరీస్ 3 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు విక్ర‌మాదిత్య మోత్వానీ, కిర‌ణ్ రావ్‌, విశాల్ భ‌ర‌ద్వాజ్‌, శ‌కున్ బ‌త్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఈ బోల్డ్ ఆంథాల‌జీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Feb 3, 2026, 5.45 pm IST

Aditi Rao Hydari | ల‌స్ట్ స్టోరీస్ 3లో అదితీరావ్ హైద‌రీ – ఈ సారి మ‌రింత బోల్డ్‌గా
Advertisement

Aditi Rao Hydari |  బోల్డ్ కాన్సెప్ట్‌ల‌తో తెర‌కెక్కిన ల‌స్ట్ స్టోరీస్ ఆంథాల‌జీ మూవీస్ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఈ ఆంథాల‌జీ మూవీస్ కోసం ద‌ర్శ‌కులు ఎంచుకున్న క‌థ‌లు, ఇందులోని సీన్ల‌పై అప్ప‌ట్లో పెద్ద డిస్క‌ష‌న్ న‌డిచింది. ఈ సినిమాల‌ను బ్యాన్ చేయాలంటూ కొంద‌రు డిమాండ్ చేశారు. ఈ విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా ల‌స్ట్ స్టోరీస్ పెద్ద విజ‌యాల‌ను సాధించాయి. ల‌స్ట్ స్టోరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు పార్ట్‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ అంథాల‌జీ ఫ్రాంఛైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది.కొత్త ద‌ర్శ‌కులు, న‌టీన‌టుల‌తో ఈ మూడో భాగం తెర‌కెక్కుతోంది. ల‌స్ట్ స్టోరీస్ 3 షూటింగ్ పూర్త‌య్యింద‌ట‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం.

నాలుగు క‌థ‌లు...

ల‌స్ట్ స్టోరీస్ 3 నాలుగు క‌థ‌ల‌తో తెర‌కెక్కుతోంది. వీటికి విక్ర‌మాదిత్య మోత్వానీ, కిర‌ణ్ రావు, విశాల్ భ‌ర‌ద్వాజ్‌, శ‌కున్ బ‌త్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
ల‌వ్ (ప్రేమ‌), ల‌స్ట్ (కామం), అధికారం (ప‌వ‌ర్‌), సామాజిక వివ‌క్ష అంశాల‌ను బోల్డ్‌గా ఈ నాలుగు క‌థ‌ల్లో చ‌ర్చించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సారి ఇంటిమేట్, రొమాంటిక్ సీన్ల డోస్ ఎక్కువ‌గానే ఉంటుంద‌ని చెబుతున్నారు.

అదితీరావ్ హైద‌రీ...

న‌లుగు క‌థ‌ల్లో బాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ యాక్ట‌ర్స్ క‌నిపించ‌బోతున్నారు. విక్ర‌మాదిత్య మోత్వానీ క‌థ‌లో రాధికా ఆప్టే, కొంక‌ణా సేన్ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. విశాల్ భ‌ర‌ద్వాజ్ సెగ్మెంట్‌లో అదితీరావ్ హైద‌రీ న‌టించిన‌ట్లు తెలిసింది. శ‌కున్ బ‌త్రా స్టోరీలో అలీ ఫ‌జ‌ల్‌, రాధికా మ‌ద‌న్ జంట‌గా క‌నిపించ‌బోతున్నారు. కిర‌ణ్ రావ్ స్టోరీలో గుర్ఫ‌తే ఫిర్జాదా, స‌నా థంపి న‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఏడాదే ల‌స్ట్ స్టోరీస్ 3 డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ బోల్డ్ ఆంథాల‌జీ మూవీపై అఫీషియ‌ల్ అప్‌డేట్ రానున్న‌ట్లు స‌మాచారం.
కాగా హీరో సిద్ధార్థ్‌తో పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది అదితీరావ్ హైద‌రీ. ఇటీవ‌ల గాంధీ టాక్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా పేరొచ్చిన క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రావ‌డం లేదు.

Advertisement
Advertisement