Thalapathy Vijay | దళపతి విజయ్ డెబ్యూ మూవీకి డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీకి ఉన్న లింక్ ఏంటంటే?
1992లో రిలీజైన నాలైయ తీర్పు మూవీతో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు దళపతి విజయ్. నాలైయ తీర్పు మూవీతో దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీకి ఓ లింక్ ఉంది. అదేమిటంటే?
Entertainment | Published On May 10, 2026, 3.46 pm IST
Thalapathy Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. లక్షలాది అభిమానుల నడుమ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని పార్టీల సపోర్ట్‌తో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు.
జననాయగన్ లాస్ట్ మూవీ...
రాజకీయాల కారణంగా దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పాడు. జననాయగన్ తన చివరి సినిమా అంటూ ప్రకటించాడు. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాపడిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ సీఎంగా మారిన తర్వాత విడుదల కానున్న సినిమా కావడంతో జననాయగన్ తమిళనాట బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.
అగ్ర హీరోల్లో ఒకరిగా...
కాగా సుదీర్ఘ సినీ ప్రయాణంలో హీరోగా విజయ్ ఇప్పటివరకు 69 సినిమాలు చేశారు. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం కష్టాలు పడిన విజయం అతి తక్కువ కాలంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో విజయ్‌తో సినిమా చేసేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ఆ స్థాయి నుంచి తన డేట్స్ కోసం అగ్ర నిర్మాతలు, దర్శకులు ఎదురుచూసే స్థాయికి విజయ్ ఎదిగారు.
డెబ్యూ మూవీ....
1992లో రిలీజైన నాలైయ తీర్పు మూవీతో హీరోగా మారాడు విజయ్. ఈ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. కొడుకును హీరోను చేయడం కోసం చంద్రశేఖర్ తన ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరి ఈ సినిమా తెరకెక్కించారు. విజయ్ తండ్రి శోభా నిర్మాతగా వ్యవహరించింది.
కాగా విజయ్ డెబ్యూ మూవీకి సంగీతం అందించింది తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. నాలైయతీర్పు సినిమాకు ఎమ్ఎమ్ శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా వ్యవహరించింది. శ్రీలేఖ...టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు ఆస్కార్ విన్నర్ కీరవాణికి చెల్లెలు అవుతుంది. నాలైయతీర్పు సినిమాకు మ్యూజిక్ అందించే నాటికి శ్రీలేఖ ఏజ్ కేవలం 12 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. శ్రీలేఖ అందించిన పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమాతోనే శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీతోనే రాజమౌళి ఫ్యామిలీ మెంబర్‌తో విజయ్ సినిమా చేశారు. కానీ నాలైయ తీర్పుతో మాత్రం విజయ్ కి హిట్టు దక్కలేదు.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



