Pawan Kalyan | ఉస్తాద్ భగత్‌సింగ్‌ను మిస్ చేసుకున్న పూజా హెగ్డే – పవన్ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ వేరు
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో అనౌన్స్ అయిన ఈ మూవీ ఐదేళ్ల తర్వాత 2026లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నిర్మాణంలో చోటుచేసుకున్న మలుపులు ఏవంటే?
N
Entertainment | Published On Mar 15, 2026, 4.02 pm IST
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
గురువారం రిలీజైన ట్రైలర్ ఉస్తాద్‌పై హైప్‌ను పెంచేసింది. ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, ఆయన మ్యానరిజమ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్ అంటూ టాలీవుడ్ వర్గాలు కూడా ట్వీట్స్ చేస్తున్నారు.
2021లో అనౌన్స్‌మెంట్...
- అనౌన్స్‌మెంట్ నుంచి రిలీజ్ వరకు ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ నిర్మాణంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. 2021లో ఈ సినిమాను ప్రకటించగా... 2026లో రిలీజ్ అవుతోంది. ఉస్తాద్ భగత్‌సింగ్‌ను తొలుత 2021 సెప్టెంబర్‌లో భవదీయుడు భగత్‌సింగ్ అనే పేరుతో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ప్రకటించారు.
- 2022 డిసెంబర్‌లో ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది. భవదీయుడు భగత్‌సింగ్ టైటిల్‌ను ఉస్తాద్ భగత్‌సింగ్‌గా మార్చుతున్నట్లు ఈ ఈవెంట్‌లో ప్రకటించారు.
- తొలుత ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే కావడంతో పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత సాక్షి వైద్య పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ టైమ్‌లో తనకున్న మూవీ కమిట్‌మెంట్స్ వల్ల పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్సయ్యానని ఇటీవల సాక్షి వైద్య అన్నది.
- కొంత భాగం షూటింగ్ పూర్తయిన ఎన్నికలు, డిప్యూటీ సీఎం బాధ్యతలతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పక్కనపెట్టారు. రెండేళ్ల పాటు షూటింగ్ నిలిచిపోయింది. దాంతో ఈ గ్యాప్‌లో హరీష్ శంకర్.... రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా తీశారు.
- 2025లో ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ తిరిగి మొదలైంది. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.
- ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. పాటలను దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేయగా... బీజీఎమ్ తమన్ సమకూర్చుతున్నారు.
- ఈ సినిమాలో తమిళ నటుడు పార్తిబన్ విలన్‌గా నటిస్తోన్నాడు. ఈ సినిమాతోనే ఈ సీనియర్ యాక్టర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
- మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- దళపతి విజయ్ హీరోగా నటించిన తేరీ మూవీ రీమేక్‌గా ఉస్తాద్‌భగత్‌సింగ్ తెరకెక్కినట్లు ప్రచారం జరిగింది. ఈ రూమర్లను ఇటీవల హరీష్ శంకర్ ఖండించారు.
- రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల రన్‌టైమ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sreeleela | నేనెప్పుడూ అతడిని కలవలేదు – డేటింగ్ రూమర్లపై శ్రీలీల క్లారిటీ
మే 18, 2026

Sreeleela | క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ తల్లి..
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



