త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singitham Srinivasarao | తొంభైనాలుగేళ్ల వ‌య‌సులో డైరెక్ష‌న్ – తెలుగు ద‌ర్శ‌కుడి రికార్డ్‌

94 ఏళ్ల వ‌య‌సులో ద‌ర్శ‌కుడిగా ఓ సినిమా చేయ‌బోతున్నారు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు. కొత్త‌వాళ్ల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తోంది.

N

Entertainment | Published On Jan 31, 2026, 5.00 pm IST

Singitham Srinivasarao | తొంభైనాలుగేళ్ల వ‌య‌సులో డైరెక్ష‌న్ – తెలుగు ద‌ర్శ‌కుడి రికార్డ్‌
Advertisement

Singitham Srinivasarao |  టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు అరుదైన రికార్డును నెల‌కొల్ప‌నున్నారు. 94 ఏళ్ల వ‌య‌సులో ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. సింగీతం శ్రీనివాస‌రావు డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న‌ 61వ మూవీ ఇది. శ‌నివారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు.సింగీతం శ్రీనివ‌స‌రావు గ‌త సినిమాల త‌ర‌హాలోనే ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీకి క‌ల్కి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌ ప్రాజెక్ట్ సూప‌ర్‌వైజ‌ర్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

61వ మూవీ...

కొత్త న‌టీన‌టుల‌తో సింగీతం 61వ మూవీ రూపొంద‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీతో అత్య‌ధిక వ‌య‌సులో మెగాఫోన్ ప‌ట్టిన‌ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌గా సింగీతం రికార్డును నెల‌కొల్ప‌నున్న‌ట్లు చెబుతోన్నారు. 2013లో వ‌చ్చిన వెల్‌క‌మ్ ఒబామా త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు దూర‌మ‌య్యారు సింగీతం శ్రీనివ‌స‌రావు. దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి పున‌రాగ‌మ‌నం చేయ‌బోతున్నారు.

క‌ల్కికి మెంట‌ర్‌...

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌ల్కి 2 మూవీకి మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు సింగీతం శ్రీనివ‌స‌రావు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది.
సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ఆదిత్య 369, పుష్ప‌క విమానం, భైర‌వ‌ద్వీపంతో పాటు ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు సింగీతం శ్రీనివాస‌రావు. తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో సినిమాలు చేశారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement