త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asha Bhosle | బాలీవుడ్ లెజెండ‌రీ సింగ‌ర్ ఆశా భోస్లే క‌న్నుమూత‌

బాలీవుడ్ లెజెండ‌రీ సింగ‌ర్ అశాభోస్లే క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆశా భోస్లే మ‌ర‌ణంతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో విషాదం అలుముకుంది.

N

Entertainment | Published On Apr 12, 2026, 1.27 pm IST

Asha Bhosle | బాలీవుడ్ లెజెండ‌రీ సింగ‌ర్ ఆశా భోస్లే క‌న్నుమూత‌
Advertisement

Asha Bhosle | బాలీవుడ్ లెజెండ‌రీ సింగ‌ర్ ఆశా భోస్లే (92) క‌న్నుమూశారు. ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బంది ఏర్ప‌డ‌టంతో కుటుంబ‌స‌భ్యులు ఆమెను ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆదివారం అశా భోస్లే తుది శ్వాస విడిచారు. అశా భోస్లే మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

12 వేల పాట‌లు...

బాలీవుడ్‌లో దిగ్గ‌జ సింగ‌ర్స్‌లో ఒక‌రిగా అశాభోస్లే గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఎనిమిది ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో దాదాపు 12 వేలకుపైగా పాట‌లు పాడారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవ‌ల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్‌తో స‌త్క‌రించింది. దాదా సాహెబ్ ఫాల్కేతో పాటు ఎన్నో అత్యున్న‌త పుర‌స్కారాల‌ను అందుకుంది.
మ‌రో దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్‌కు అశా భోస్లే సోద‌రి అవుతారు. అక్క ల‌తా స్కూర్తితోనే ఆశా భోస్లే సింగ‌ర్‌గా అడుగులు వేసింది. మ‌రాఠీ మూవీ మ‌జా భ‌ల్‌తో ఆశా భోస్లే కెరీర్ ప్రారంభ‌మైంది. ల‌తా మంగేష్క‌ర్‌, గీతా ద‌త్ వంటి వారితో పోటీ కార‌ణంగా కెరీర్ ఆరంభంలో అశా భోస్లేకు అంత‌గా అవ‌కాశాలు రాలేదు.
న‌యా దౌర్‌లోని ఆశా భోస్లే పాడిన పాట‌లు పెద్ద హిట్ట‌వ్వ‌డంతో సింగ‌ర్‌గా బిజీగా మారిపోయింది. ఉమ్రాన్ జావ్‌, తీస్రీ మంజ‌ల్‌, హ‌రే రామా హ‌రే కృష్ణ సినిమాల‌తో టాప్ సింగ‌ర్‌గా మారిపోయింది.

ఇర‌వై భాష‌ల్లో...

హిందీ, తెలుగుతో పాటు ఇర‌వైకిపైగా భాష‌ల్లో పాట‌లు పాడింది ఆశా భోస్లే. రొమాంటిక్‌, రాక్‌, మెలోడీ, గ‌జ‌ల్‌...అన్ని ర‌కాల పాట‌ల‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించింది. చివ‌ర‌గా 2022లో వ‌చ్చిన లైఫ్ ఈజ్ గుడ్‌లో ఓ పాట పాడింది. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల గ‌త మూడేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది.

ఆశా భోస్లే అంత్య‌క్రియ‌ల‌ను సోమ‌వారం ముంబైలోని శివాజీ పార్క్‌లో నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ప్ర‌క‌టించారు.

 

Advertisement
Advertisement