Rashmika Mandanna | వైల్డ్ లుక్‌లో రష్మిక – మైసా ఫస్ట్ సింగిల్ రిలీజ్
రష్మిక మందన్న మైసా మూవీ నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. ఓ మైసా రే అంటూ సాగిన ఈ పాటలో వైల్డ్ లుక్‌లో రష్మిక కనిపించింది. మైసా మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Nov 2, 2026, 7.34 pm IST
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా. యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ రవీంద్ర పుల్లె ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మైసా మూవీ ప్రమోషన్స్‌ను సోమవారం నుంచి మొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఓ మైసా రే అంటూ సాగిన ఈ లిరికల్ వీడియో సాంగ్‌లో వైల్డ్ లుక్‌లో రష్మిక కనిపించింది. రౌద్రస్వరూపంతో ఆకట్టుకుంది. ఆమె ఎనర్జిటిక్ స్టెప్పులు పాటకు హైలైట్‌గా నిలిచాయి.
సుద్దాల అశోక్‌తేజ...
ఓ మైసా రే సాంగ్‌కు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం సమకూర్చారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటలో మైసాను ఈషి, ఐషి రూపాల్లో అభివర్ణించారు సుద్దాల అశోక్‌తేజ. స్త్రీ శక్తిని, అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబిస్తూ పాట సాగింది. మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ, ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని ఈ పాటలోని పదాలు చాటుతున్నాయి.
ఫస్ట్ సింగిల్...
ఓ మైసా రే పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఫస్ట్ సింగిల్‌లో మైసా కోసం రష్మిక మందన్న పడిన కష్టం, పాత్రకు న్యాయం చేసేందుకు చూపించిన అంకితభావం ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా మంది డ్యాన్సర్ల ఈ పాటను చిత్రీకరించిన తీరు విభిన్నంగా ఉంది.
యాక్షన్ రోల్
ఇందులో మైసా అనే గిరిజన జాతికి చెందిన యువతిగా రష్మిక కనిపించబోతుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో ఆమె నటిస్తోన్న మొదటి మూవీ ఇది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంది. రిస్కీ స్టంట్స్ చేసింది. మైసాలో ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావురమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!
- ●Abdullah Family Kashmiri Pandit Roots | నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి: కశ్మీరీ పండిట్లతో అబ్దుల్లా కుటుంబానికి ఉన్న శతాబ్దాల బంధం ఏమిటి?
- ●RS Praveen Kumar | కాంగ్రెసోళ్లు ఢిల్లీల తాగి కొట్టుకున్నరట.. ఈరోజు న్యూసంతా అదే
- ●Amit Shah | కాంగ్రెస్..వెంటిలేటర్ పార్టీ
- ●Kajal Aggarwal | భర్తతో కాజల్ రొమాంటిక్ ఫొటోషూట్ - "దాదా" షూటింగ్‌కు బ్రేక్
- ●Ponnam Prabhakar | అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!

Abdullah Family Kashmiri Pandit Roots | నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి: కశ్మీరీ పండిట్లతో అబ్దుల్లా కుటుంబానికి ఉన్న శతాబ్దాల బంధం ఏమిటి?

RS Praveen Kumar | కాంగ్రెసోళ్లు ఢిల్లీల తాగి కొట్టుకున్నరట.. ఈరోజు న్యూసంతా అదే

Amit Shah | కాంగ్రెస్..వెంటిలేటర్ పార్టీ






