త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Comedy OTT | డైరెక్ట్ గా ఓటీటీలోకి టాలీవుడ్ కామెడీ మూవీ – హైప‌ర్ ఆది పంచ్‌లు హైలైట్‌

టాలీవుడ్ క‌మెడియ‌న్ హ‌ర్ష‌చెముడు హీరోగా న‌టించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. అక్టోబ‌ర్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ మూవీలో హైప‌ర్ ఆది, ఐశ్వ‌ర్య హోల‌క్క‌ల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Oct 4, 2026, 3.18 pm IST

Comedy OTT | డైరెక్ట్ గా ఓటీటీలోకి టాలీవుడ్ కామెడీ మూవీ – హైప‌ర్ ఆది పంచ్‌లు హైలైట్‌
Advertisement

Comedy OTT |  టాలీవుడ్ క‌మెడియ‌న్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. బాబు డెగాల దర్శకత్వం వహించిన అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో జీవన్ కుమార్, హైప‌ర్ ఆది, ఐశ్వర్య హోలక్కల్, రూప శ్రావ్య‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌...

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఉద్యోగం లేక‌పోవ‌డంతో ఓ యువ‌కుడికి పెళ్లి చేసుకోవ‌డానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. జాబ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన అత‌డు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరుతాడు. సాఫ్ట్‌వేర్‌పై ఎలాంటి అవ‌గాహ‌న లేకుండా జాబ్‌లో చేరిన అత‌డు అక్క‌డ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? స‌హోద్యోగుల‌తో అత‌డి స‌రాదాల‌తో ట్రైల‌ర్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది. ట్రైల‌ర్‌కు హైప‌ర్ ఆది పంచ్‌లు, హ‌ర్ష చెముడు, జీవ‌న్ కుమార్‌ కామెడీ టైమింగ్ హైలైట్‌గా నిలిచాయి.

కామెడీ విత్ సెంటిమెంట్‌...

కామెడీతో పాటు అంత‌ర్లీనంగా సెంటిమెంట్‌, మెసేజ్ కూడా ఉండ‌బోతున్న‌ట్లు చూపించారు. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాకు అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించారు.శక్తి అరవింద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement
Advertisement