Lavanya Tripathi | లావణ్య త్రిపాఠి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ – యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ప్రాజెక్ట్ జడ్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు.
Entertainment | Published On Mar 13, 2026, 12.34 pm IST
Lavanya Tripathi | సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన తెలుగు మూవీ ప్రాజెక్ట్ జెడ్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా మంచి విజయాన్ని దక్కించుకుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి సీవీ కుమార్ దర్శకత్వం వహించాడు.
యూట్యూబ్‌లో రిలీజ్...
తాజాగా ప్రాజెక్ట్ జెడ్ మూవీ యూట్యూబ్‌లో గురువారం రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి రెంటల్, సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఈ సినిమాను చూడొచ్చు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళంలో మయావన్ పేరుతో రిలీజైంది.
బాలీవుడ్ నటుడు...
ప్రాజెక్ట్ జెడ్ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విలన్‌గా నటించాడు. డానియెల్ బాలాజీ, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ప్రాజెక్ట్ జెడ్ కాన్సెప్ట్‌తో పాటు సినిమాలోని ట్విస్ట్‌లు, టర్న్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
వరుస హత్యల మిస్టరీ...
కుమార్ (సందీప్ కిషన్) పోలీస్ ఆఫీసర్. రక్తం చూడగానే కళ్లు తిరిగిపడిపోతుంటాడు. ఓ హంతకుడిని పట్టుకొనే క్రమంలో కుమార్ తప్పిదం కారణంగా నిందుతుడు మరణిస్తాడు. దాంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. తిరిగి జాబ్‌లో జాయిన్ కావడానికి మెంటల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. సైకో థెరఫిస్ట్ అదీర (లావణ్య త్రిపాఠి) సహాయంతో తిరిగి ఉద్యోగంలో చేరుతాడు. తొలి కేసులోనే అతడికి ఛాలెంజ్ ఎదురవుతుంది. నగరంలో వరుసగా ఒకే తరహాలో హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలకు ఆర్మీ మేజర్ సత్యకు (జాకీ ష్రాఫ్) ఉన్న సంబంధం ఏమిటి? హంతకుడిని పట్టుకొనే క్రమంలో కుమార్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అన్నదే ప్రాజెక్ట్ జడ్ మూవీ కథ.
కాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతీలీలావతి అనే సినిమా చేస్తోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



