Lavanya Tripathi | పెళ్లి తర్వాత మెగా కోడలి ఫస్ట్ మూవీ- ప్రెగ్నెంట్ అని చెప్పగానే షాకయ్యారంటూ కామెంట్స్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన సతీ లీలావతి మూవీ మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీకి తాతినేసి సత్య దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Feb 12, 2026, 3.34 pm IST
Lavanya Tripathi | హీరో వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ జంటకు మగపిల్లాడు జన్మించాడు. తనయుడికి వాయువ్‌తేజ్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. పెళ్లి, మాతృత్వ బంధం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. క్రైమ్ కామెడీ మూవీతో తెలుగు తెరపై సందడి చేయబోతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన సతీ లీలావతి మూవీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు. బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.
ప్రెగ్నెన్సీతోనే...
ఈ వేడుకలో లావణ్య త్రిపాఠి పాల్గొన్నది. సతీలీలావతి మూవీ జర్నీ, తన క్యారెక్టర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సతీ లీలావతి షూటింగ్ మొదలుపెట్టినప్పుడు తాను ప్రెగ్నెంట్ అని లావణ్య త్రిపాఠి చెప్పింది షూటింగ్‌లో తొలిరోజే డైరెక్టర్ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు. రిస్కీ స్టంట్ కావడంతో నేను ప్రెగ్నెంట్ అనే దర్శకుడికి చెప్పా. ఆయన షాకయ్యారు. నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్‌న్యూస్‌ను అందరితో అలా పంచుకున్నా. ప్రెగ్నెన్సీలోనే కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను అని లావణ్య త్రిపాఠి అన్నది.
మంచి కథ దొరికితే భర్త వరుణ్‌తేజ్‌తో సినిమా చేయాలని ఉందని లావణ్య త్రిపాఠి అన్నది. వరుణ్‌తేజ్‌తో పెళ్లి విషయంలో తాను ఏడేళ్లు ఆలోచించి ముందడుగు వేసినట్లు చెప్పింది. కొంచెం టైమ్ తీసుకున్నా సరే కాబోయే జీవితభాగస్వామి గురించి అన్ని తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నది. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నానని, సినిమాలను కొనసాగిస్తానని లావణ్య త్రిపాఠి తెలిపింది.
కమల్‌హాసన్ సినిమాతో పోలికలు...
గతంలో సతీలీలావతి పేరుతో కమల్‌హాసన్ ఓ సినిమా చేశారు. కమల్‌హాసన్ సూపర్ హిట్ మూవీతో తమ కథకు ఎలాంటి పోలికలు ఉండవని డైరెక్టర్ అన్నారు. నవ్విస్తూనే ఈ సినిమా థ్రిల్లింగ్‌ను పంచుతుందని చెప్పారు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్‌తో పాటు వీటీవీ గణేష్, సప్తగిరి..ఇలా ప్రతి పాత్ర డిఫరెంట్ ఉంటుందని డైరెక్టర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Lavanya Tripathi | థియేటర్లలో రిలీజై రెండు వారాలు కాకముందే ఓటీటీలోకి మెగా కోడలు మూవీ – భర్తను కట్టేసి కొడితే…
మే 16, 2026

Sathi Leelavathi Review | సతీ లీలావతి రివ్యూ – మెగా కోడలి రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
మే 8, 2026

Lavanya Tripathi | అప్పుడు ప్రెగ్నెంట్ అని తెలీదు.. ఇకపై షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తా : లావణ్య త్రిపాఠి
మే 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



