Sathi Leelavathi Review | సతీ లీలావతి రివ్యూ – మెగా కోడలి రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో లావణ్య త్రిపాఠి హిట్టు కొట్టిందా? అంటే?
Entertainment | Published On May 8, 2026, 8.01 pm IST
Sathi Leelavathi Review | మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన మూవీ సతీ లీలావతి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. దేవ్ మోహన్ హీరోగా కనిపించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
లీలావతికి విడాకులు...
లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. అమెలోని భయాలను పోగొట్టి డైరెక్టర్ కావడానికి సైకలాజిస్ట్ రామ్‌సేతు (దేవ్ మోహన్) హెల్ప్ చేస్తాడు. ఈ క్రమంలోనే సేతుతో ప్రేమలో పడుతుంది. కానీ సేతు మాత్రం ఆమెను ఫ్రెండ్‌గానే చూస్తాడు. లీలావతి తండ్రి (సీనియర్ నరేష్) సేతును బెదిరించి తన కూతురితో అతడి పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి తర్వాత లీలావతి సినిమా షూటింగ్‌లతో బిజీ అవుతుంది. భర్తతో మాట్లాడటానికి కూడా ఆమెకు టైమ్ దొరకదు. భార్య తనను దూరం పెట్టిన టైమ్‌లోనే నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్) అనే మరో అమ్మాయితో సేతు ప్రేమలో పడతాడు. లీలావతికి విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఈ విడాకులకు లీలావతి ఒప్పుకోదు భర్తను కొట్టి ఇంట్లోనే కట్టిపడేస్తుంది. తమ ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేస్తే సేతును కన్వీన్స్ చేయాలని అనుకుంటుంది. కానీ సేతు మాత్రం లీలా మాటలకు కరిగిపోడు. అదే టైమ్‌లో మెట్ట రాజర్ (మొట్ట రాజేంద్రన్) అనే ఓ ప్రొడ్యూసర్ లీలావతిని కిడ్నాప్ చేస్తాడు? మరో దొంగ (సప్తగిరి) ఆమె ఇంట్లోకి చొరబడి డబ్బు దోచేస్తాడు? వీళ్లతో లీలావతికి ఉన్న సంబంధం ఏమిటి? సేతును కలవాలని అతడి ప్రియురాలు నికోలాతో పాటు లాయర్ తమలపాకుల సుందరపాండియన్‌లకు (వీటీవీ గణేష్) సేతు ఇంట్లో లేడని లీలావతి ఎందుకు అబద్దం చెప్పింది? భార్య ప్రేమను సేతు ఎలా అర్థం చేసుకున్నాడు? అన్నదే సతీ లీలావతి మిగిలిన కథ.
రొటీన్ కాన్సెప్ట్...
అపోహలు, అపార్థాలతో భార్యాభర్తలు గొడవలు పడటం, చివరకు తమ తప్పులను సరిదిద్దుకొని ఒక్కటవ్వడం అనే కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ కాన్సెప్ట్‌ను ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ఈ రొటీన్ కాన్సెప్ట్‌తోనే దర్శకుడు తాతినేని సత్య సతీలీలావతి కథను రాసుకున్నారు.
ప్రస్తుతం జెన్‌జీ ఆడియెన్స్ అభిరుచులు మారిపోయాయి. ఎంత సీరియస్ కాన్‌ఫ్లిక్ట్‌ను అయినా కామెడీతో జోడించి చెబితేనే రిసీవ్ చేసుకుంటున్నారు. సతీ లీలావతితో ఈ ఫార్మెట్‌ను ఫాలో అయ్యారు డైరెక్టర్.
కడవరకు కలిసి ఉంటేనే...
ఎన్ని గొడవలు వచ్చినా భార్యాభర్తలు విడిపోవద్దని, కడవరకు కలిసి ఉంటేనే ఆ బంధానికి అర్థం, పరమార్థం ఉంటుందని సతీ లీలావతితో దర్శకుడు చెప్పాలని అనుకున్నాడు. మరో అమ్మాయి వ్యామోహంలో పడిన తన భర్తలో ఓ భార్య ఎలా మార్పు తీసుకొచ్చింది, ఇందుకోసం ఆమె వేసిన ఎత్తులేమిటి అన్నది ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
సహనానికి పరీక్షగా...
దర్శకుడు రాసుకున్న కథ స్క్రీన్‌పై వచ్చేసరికి మొత్తం మారిపోయింది. ఓ బిల్డింగ్ ...అందులోకి ఎంట్రీ ఇచ్చే రకరకాల క్యారెక్టర్లు...కామెడీ పేరుతో వారు చేసే హంగామాతో సినిమా సహనానికి పరీక్షగా మారిపోయింది. మోట్ట రాజేంద్రన్, సప్తగిరి, వీటీవీ గణేష్ ట్రాక్‌లు నవ్వించలేకపోయాయి. లీలావతితో వారికి ఉన్న సంబంధమేమిటనే క్లైమాక్స్ ట్విస్ట్ పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను గేమ్ స్టైల్‌లో డిఫరెంట్‌గా డిజైన్ చేశారు.
కామెడీ టైమింగ్...
సతీ లీలావతి కోసం లావణ్య త్రిపాఠి చాలానే కష్టపడింది. తన కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకుంది. దేవ్ మోహన్ స్టైలిష్‌గా కనిపించాడు. యాక్టింగ్‌ను కనబరిచే స్కోప్ అతడికి దక్కలేదు. సీనియర్ నరేష్ క్యారెక్టర్ తేలిపోయింది. స్క్రీన్‌పై చాలా మందే కమెడియన్లు కనిపించినా ఎవరూ సినిమాను నిలబెట్టలేకపోయారు. టెక్నికల్‌గా ఉన్నంతలో మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఒక్కటే కాస్తంత రిలీఫ్‌గా నిలిచింది.
ఓపిక కావాల్సిందే...
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సిల్లీ ఫ్యామిలీ కామెడీ మూవీ. చివరి వరకు చూడాలంటే ఓపిక కావాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



