త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lavanya Tripathi | రొమాంటిక్ కామెడీ మూవీతో మెగా కోడ‌లు రీఎంట్రీ – స‌తీ లీలావ‌తి రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లి త‌ర్వాత మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి స‌తీ లీలావ‌తి మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో దేవ్ మోహ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. స‌తీ లీలావ‌తి రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ శ‌నివారం క‌న్ఫామ్ చేశారు.

N

Entertainment | Published On Apr 25, 2026, 11.37 am IST

Lavanya Tripathi | రొమాంటిక్ కామెడీ మూవీతో మెగా కోడ‌లు రీఎంట్రీ – స‌తీ లీలావ‌తి రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Lavanya Tripathi |మెగా హీరో వ‌రుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లావ‌ణ్య త్రిపాఠి సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత స‌తీ లీలావ‌తి మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దేవ్ మోహ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. తాతినేని స‌త్య ద‌ర్శ‌కుడు.
స‌తీలీలావ‌తి రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ శ‌నివారం క‌న్ఫామ్ చేశారు. మే 8న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

డేరింగ్ అండ్ డాషింగ్‌...

భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల‌కు చెందిన ఓ జంట ప్రేమ‌క‌థ‌తో ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య ఈ సినిమాను తెర‌కెక్కించారు. భార్యాభ‌ర్త‌ల బంధాన్ని ఆవిష్క‌రించిన తీరు వినోదాన్ని పంచుతుంది. ఇందులో లీలాగా డేరింగ్ అండ్ డాషింగ్ రోల్‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌బోతున్న‌ది. ఆమె కెరీర్‌లోనే డిఫ‌రెంట్ మూవీగా స‌తీలీలావ‌తి నిలుస్తుంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

త్వ‌ర‌లో ట్రైల‌ర్‌...

స‌తీ లీలావ‌తి మూవీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రెండు పాట‌ల‌తో ఓ పాటు టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తామ‌ని అన్నారు. ఈ సినిమాలో స‌ప్త‌గిరి, సీనియ‌ర్ న‌రేష్‌, వీటీవీ గ‌ణేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స‌తీ లీలావ‌తి సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ అందించారు.

భీమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టు...

స‌తీ లీలావ‌తి కంటే ముందు భీమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టు, ఎస్ఎమ్ఎస్‌తో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు తానినేని స‌త్య‌. చివ‌ర‌గా తెలుగులో హ్యాపీ బ‌ర్త్‌డే సినిమా చేసింది లావ‌ణ్య త్రిపాఠి. 2022లో ఈ మూవీ రిలీజైంది.

 

Advertisement
Advertisement