Lavanya Tripathi | థియేటర్లలో రిలీజై రెండు వారాలు కాకముందే ఓటీటీలోకి మెగా కోడలు మూవీ – భర్తను కట్టేసి కొడితే…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ సతీ లీలావతి థియేటర్లలో రిలీజైన పదమూడు రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. మే 20 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On May 16, 2026, 7.38 pm IST
Lavanya Tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ సతీ లీలావతి గత వారమే థియేటర్లలోకి వచ్చింది. కనీసం రెండు వారాలు కూడా కాకముందే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మే 20 నుంచి సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య గ్యాప్‌కు కేవలం పదమూడు రోజులే ఉండటం ఆసక్తికరంగా మారింది. డిజాస్టర్‌గా నిలవడంతో ఈ సినిమా త్వరగా ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మలయాళ నటుడు...
సతీ లీలావతి మూవీలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. లావణ్య త్రిపాఠితో పాటు మడోన్నా సెబాస్టియన్ మరో హీరోయిన్‌గా నటించింది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరి, వీటీవీ గణేష్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషించారు.
పెళ్లి తర్వాత...
భార్యభర్తల బంధానికి వినోదాన్ని జోడించి దర్శకుడు తాతినేని సత్య సతీ లీలావతి సినిమాను తెరకెక్కించారు. కాన్సెప్ట్‌లో ఆసక్తి లోపించడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన సినిమా ఇది. దాదాపు నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా హిట్టు మాత్రం దక్కలేదు. సతీ లీలావతికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
సినిమా డైరెక్టర్....
లీలావతి (లావణ్య త్రిపాఠి) సినిమా డైరెక్టర్. సైకాలజిస్ట్ సేతును ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అపోహలు, అపార్థాల కారణంగా లీలావతికి విడాకులు ఇచ్చి నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్) అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సేతు అనుకుంటాడు. ఈ విడాకులకు లీలావతి ఒప్పుకోదు భర్తను కొట్టి ఇంట్లోనే కట్టిపడేస్తుంది. ఆ తర్వాత ఏమైంది. మెట్ట రాజర్ (మొట్ట రాజేంద్రన్) అనే ప్రొడ్యూసర్‌తో పాటు ఓ దొంగ సాయంతో లీలావతి తన కాపురాన్ని ఎలా చక్కబెట్టుకుంది అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



