త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Releases | ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ స్పెష‌ల్‌

ఈ వార థియేట‌ర్ల‌లో పాటు ఓటీటీలో ప‌లు చిన్న సినిమాలు, సిరీస్‌లు సంద‌డి చేశాయి. మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ప్ర‌థ‌మ దృష్ట్య‌కుట్ట‌తార్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప‌లు తెలుగు సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్ష‌క‌లు ముందుకొచ్చాయి.

N

Entertainment | Published On Oct 9, 2026, 5.31 pm IST

OTT Releases |  ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ స్పెష‌ల్‌
Advertisement

ఈ వారం ప‌లు తెలుగు సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో క‌లిపి శుక్ర‌వారం ఇర‌వై వ‌ర‌కు సినిమాలు ఓటీటీలో సంద‌డి చేశాయి. ఆ సినిమాలు ఏవంటే?

నెట్‌ఫ్లిక్స్

మండాడి (త‌మిళ్‌)

కోలీవుడ్ క‌మెడియ‌న్ సూరి హీరోగా న‌టించిన మండాడి మూవీ థియేట‌ర్ల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ప‌డ‌వ పోటీల నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ న‌టుడు సుహాస్ విల‌న్‌గా క‌నిపించాడు. కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది.

ఎపిక్ (తెలుగు)

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించిన రొమాంటిక్ మూవీ ఎపిక్ శుక్ర‌వారం ఓటీటీలోకి వ‌చ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ రొమాంటిక్ మూవీకి ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థియేట‌ర్ల‌లో క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా ఈ మూవీ నిలిచింది.
ప్ర‌థ‌మ దృష్ట్య‌కుట్ట‌తార్ (మ‌ల‌యాళం)
రిపోర్టింగ్ లైవ్ (హిందీ)
అన్‌ఫ‌ర్‌గెటెబుల్ వెబ్‌సిరీస్ (ఇంగ్లీష్‌)

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఖ‌లీఫా (మ‌ల‌యాళం)
మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, మాళ‌వికా శ‌ర్మ జంట‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఖ‌లీఫా ఆరు ఓటీటీల‌లో రిలీజైంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు వైశాక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
వీడియో (క‌న్న‌డ)
అవారాప‌న్ 2 (హిందీ)
స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే (ఇంగ్లీష్‌)
బ్లాక్ జాంబీ (ఇంగ్లీష్‌)
కాల‌నీ (ఇంగ్లీష్‌)

ఆహా ఓటీటీ

మారెమ్మ (తెలుగు)

మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌మ్ముడి కొడుకు మాధ‌వ్‌...మారెమ్మ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో శుక్ర‌వారం రిలీజైంది. దీపా బాలు హీరోయిన్‌గా న‌టించింది.
పారిస్ కేఫ్ (త‌మిళం)

ఈటీవీ విన్

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ (తెలుగు)

హ‌ర్ష చెముడు, హైప‌ర్ ఆది ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ శుక్ర‌వారం ఈటీవీ విన్ ఓటీటీతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఆరు ఎపిసోడ్స్‌తో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ వెబ్‌సిరీస్ రూపొందింది.

సోనీ లివ్ ఓటీటీ

ది ఐస్ వెబ్‌సిరీస్ (మ‌ల‌యాళం)

స‌న్ నెక్స్ట్ ఓటీటీ

లైఫ్ టుడే

Advertisement
Advertisement