త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

2025 Movies | 2025 అత్య‌ధిక లాభాల్ని మిగిల్చిన టాప్ టెన్‌ ఇండియ‌న్ మూవీస్‌ ఇవే – లిస్ట్‌లో ఒకే ఒక‌ తెలుగు మూవీ

2025 Movies | ఈ ఏడాది అత్య‌ధిక లాభాల‌ను మిగిల్చిన టాప్ టెన్ ఇండియ‌న్ సినిమాల్లో గుజ‌రాతీ మూవీ లాలో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. కేవ‌లం యాభై ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 94 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్‌లో నుంచి లిటిల్ హార్ట్స్ ఒక్క‌టే చోటు ద‌క్కించుకుంది.

N

Entertainment | Published On Dec 21, 2025, 4.09 pm IST

2025 Movies | 2025 అత్య‌ధిక లాభాల్ని మిగిల్చిన  టాప్ టెన్‌ ఇండియ‌న్  మూవీస్‌ ఇవే – లిస్ట్‌లో ఒకే ఒక‌ తెలుగు మూవీ
Advertisement

2025 Movies | 2025లో పాన్ ఇండియ‌న్ సినిమాల హ‌వా అంత‌గా క‌నిపించ‌లేదు భారీ బ‌డ్జెట్‌ల‌తో రూపొందిన స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. మ‌రోవైపు ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన కొన్ని చిన్న సినిమాలు సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేశాయి నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను పండించాయి. ఇందులో కొన్ని సినిమాలు కేవ‌లం ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తోనే రూపొందాయి. కానీ వాటి క‌లెక్ష‌న్స్ మాత్రం కోట్ల‌లో వ‌చ్చాయి. 2025లో మోస్ట్ ప్రాఫిట‌బుల్ టాప్ టెన్ మూవీస్ ఏవంటే?

టాప్‌లో గుజ‌రాతీ మూవీ....

గుజ‌రాతీ మూవీ లాలో కృష్ణ స‌దా స‌హాయ‌తే ఈ ఏడాది అత్య‌ధిక లాభాల్ని మిగిల్చిన ఇండియ‌న్ సినిమాల్లో ఫ‌స్ట్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. కేవ‌లం యాభై ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిన్న సినిమా 94 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. క‌ష్టాల్లో ఉన్న ఓ సాధార‌ణ ఆటోడ్రైవ‌ర్‌కు దేవుడు ఎలా అండ‌గా నిలిచాడ‌నే పాయింట్‌తో లాలో రూపొందింది.
శాండ‌ల్‌వుడ్‌ మూవీ సు ఫ్ర‌మ్ సో ఈ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. 4.5 కోట్ల‌తో క‌న్న‌డ హీరో క‌మ్ డైరెక్ట‌ర్‌ రాజ్ బీ శెట్టి నిర్మించిన ఈ హార‌ర్ కామెడీ ఏకంగా 92 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పెట్టిన పెట్టుబ‌డికి ఇర‌వై ఇంత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టింది.
యానిమేటెడ్ మూవీ మ‌హావ‌తార్ న‌ర‌సింహా 2025లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. తెలుగు, త‌మిళ, క‌న్నడ అనే భేదాలు లేకుండా అన్ని భాష‌ల ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. 15 కోట్ల తో రూపొందిన ఈ సినిమా 247 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది.

తెలుగు మూవీ ఒక్క‌టే...

మోస్ట్ ప్రాఫిట‌బుల్ ఇండియ‌న్ సినిమాల జాబితాలో తెలుగు మూవీ లిటిల్ హార్ట్స్ (Little Hearts) ఒక్క‌టే చోటును ద‌క్కించుకుంది. ఈ సినిమా నాలుగో ప్లేస్‌లో నిలిచింది. మౌళి త‌నూజ్‌, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ రొమాంటిక్ కామెడీ నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌గా...26 కోట్ల‌కుపైగా వ‌సూళ్లు వ‌చ్చాయి.
ఇక బాలీవుడ్‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న సైయారా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అహాన్ పాండే, అనీత్ ప‌డ్డా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ బాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన రొమాంటిక్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 45 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన సైయార‌కు ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 337 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చాయి.
అస్సామీ మూవీ రాయ్ రాయ్ బినాలే ఆరో ప్లేస్‌లో (5 కోట్ల బ‌డ్జెట్ 30 కోట్ల క‌లెక్ష‌న్స్‌), బౌ బుట్టు బూత (మూడు కోట్ల బ‌డ్జెట్ - 17 కోట్ల క‌లెక్ష‌న్స్‌) ఏడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాయి.

కాంత‌ర ఛాప్ట‌ర్ వ‌న్

లాభాల పంట‌ను పండించిన ఇండియ‌న్ మూవీస్‌లో మ‌ల‌యాళ (Malayalam Movie) సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ లోక ఛాప్ట‌ర్ వ‌న్ ఎనిమిదో స్థానాన్ని ద‌క్కించుకుంది. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 155 కోట్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ సినిమా బ‌డ్జెట్ 30 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం.
ఇక రిష‌బ్ శెట్టి కాంత‌ర ఛాప్ట‌ర్ వ‌న్ తొమ్మిదో స్థానాన్ని ఉంది. 125 కోట్ల తో రూపొందిన ఈ పాన్ ఇండియ‌న్ మూవీ 620 కోట్ల‌తో అద‌ర‌గొట్టింది. మోస్ట్ ప్రాఫిట‌బుల్ ఇండియ‌న్ మూవీస్ లిస్ట్‌లో మ‌రాఠీ మూవీ ద‌శావ‌తార్ చివ‌రి స్థానాన్ని సొంతం చేసుకుంది. కేవ‌లం 5 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మైథాల‌జీ మూవీ 24 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Advertisement

తాజావార్తలు

Advertisement