త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh | ధురంధ‌ర్ 2 హీరోకు షాకిచ్చిన క‌ర్ణాట‌క హైకోర్టు – కాంతార వివాదంలో మ‌రో ట్విస్ట్‌

కాంతార ఛాప్ట‌ర్ వ‌న్ ఇమిటేష‌న్ వివాదానికి సంబంధించి ధురంధ‌ర్ 2 హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌కు క‌ర్ణాట‌క హైకోర్టు షాకిచ్చింది. మైసూర్‌లోని చాముండి ఆల‌యానికి వ‌చ్చి అక్క‌డి నుంచి క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ర‌ణ‌వీర్‌సింగ్‌ను హైకోర్టు ఆదేశించింది.

N

Entertainment | Published On Mar 29, 2026, 4.55 pm IST

Ranveer Singh | ధురంధ‌ర్ 2 హీరోకు షాకిచ్చిన క‌ర్ణాట‌క హైకోర్టు – కాంతార వివాదంలో మ‌రో ట్విస్ట్‌
Advertisement

Ranveer Singh |  ధురంధ‌ర్ 2 హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌కు క‌ర్ణాట‌క హైకోర్టు షాకిచ్చింది. కాంతార ఛాప్ట‌ర్ వ‌న్ మూవీ వివాదానికి సంబంధించి ముంబైలో కాకుండా క‌ర్ణాట‌క వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆదేశించింది. గ‌త ఏడాది జ‌రిగిన ఓ ఈవెంట్‌లో కాంతార ఛాప్ట‌ర్ వ‌న్‌లో రిష‌బ్ శెట్టి యాక్టింగ్‌, డైలాగ్స్‌ను ర‌ణ‌వీర్‌సింగ్ ఇమిటేట్ చేశారు. ర‌ణ‌వీర్‌సింగ్ ఇమిటేష‌న్‌పై దారుణంగా ట్రోల్స్ వ‌చ్చాయి. పంజుర్లి, గుళిగ సంప్ర‌దాయాల‌ను అప‌హాస్యం చేయ‌డంపై దారుణంగా ట్రోల్స్ వ‌చ్చాయి. కోస్తా క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల ఆరాధ్య దైవ‌మైన‌ చాముండి దేవ‌త‌ను ర‌ణ‌వీర్‌సింగ్ భూతంగా పేర్కొన‌డం కూడా వివాదానికి దారితీసింది. ర‌ణ‌వీర్‌సింగ్‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ వివాదంపై రణ‌వీర్‌సింగ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

హైకోర్టులో పిటిష‌న్‌...

అయినా క‌న్న‌డ అభిమానులు శాంతించ‌లేదు. క‌ర్ణాట‌క హైకోర్టు వ‌ర‌కు ఈ వివాదం చేరుకుంది. తమ దేవ‌త‌ను, సంస్కృతిని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేసి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశారంటూ ర‌ణ‌వీర్‌సింగ్‌పై ఓ వ్య‌క్తి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై ఇటీవ‌ల క‌ర్ణాట‌క హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ర‌ణ‌వీర్‌సింగ్ కామెంట్ల‌ను కోర్టు కూడా త‌ప్పుప‌ట్టింది.

మైసూర్ రావాలి...

ఈ కాంతార కాంట్ర‌వ‌ర్సీకి పుల్‌స్టాప్ పెట్టాల‌ని భావించిన ర‌ణ‌వీర్‌సింగ్ అవ‌స‌ర‌మైతే తాను భేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని త‌న త‌ర‌ఫు లాయ‌ర్స్ ద్వారా హైకోర్టుకు నివేదించారు. ఈ క్ష‌మాప‌ణ‌ల‌ను ముంబైలో ఉండి కాకుండా క‌ర్ణాట‌క వ‌చ్చి చెప్పాల‌ని హైకోర్టు అన్న‌ది. రణవీర్ సింగ్ స్వయంగా మైసూరులోని చాముండి హిల్స్ అమ్మ‌వారి ఆలయాన్ని దర్శించుకోవాల‌ని అన్న‌ది. అక్క‌డికి వ‌చ్చి వ్యక్తిగతంగా క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు క్షమాపణలు చెప్పాల‌ని ఆదేశించింది. కోర్టు తీర్పుతో త్వ‌ర‌లోనే ర‌ణ‌వీర్‌సింగ్ మైసూరు రానున్న‌ట్లు స‌మాచారం.

క‌లెక్ష‌న్ల వ‌ర్షం...

కాగా ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద అడ‌ర‌గొడుతోంది. 11 రోజుల్లోనే 1226 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంజ‌య్ ద‌త్‌, మాధ‌వ‌న్‌, సారా అర్జున్‌, అర్జున్ రాంపాల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement