Ranveer Singh | చిక్కుల్లో పడ్డ ధురంధర్ హీరో – మత విద్వేషాలు రెచ్చగొట్టారంటూ రణవీర్‌పై కేసు నమోదు
ధురంధర్ హీరో రణవీర్‌సింగ్ చిక్కుల్లో పడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టారంటూ బెంగళూరులో అతడిపై కేసు నమోదు అయ్యింది. కాంతార హీరో రిషబ్ శెట్టిని అనుకరిస్తూ అతడు చేసిన మిమిక్రీ ఈ వివాదానికి కారణమైంది.
Entertainment | Published On Jan 29, 2026, 2.14 pm IST
Ranveer Singh |ధురంధర్ హీరో రణవీర్‌సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఈ బాలీవుడ్ హీరోపై బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. దైవ కోల సంప్రదాయాన్ని అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ రణవీర్‌సింగ్‌పై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రశాంత్ మేథిల్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వివాదంపై ఇప్పటికే రణవీర్‌సింగ్ క్షమాపణలు చెప్పారు. అయినా కూడా వదలకుండా ఈ బాలీవుడ్ హీరోపై కేసు నమోదు ఆసక్తికరంగా మారింది.
ఇఫీ వేడుకలో...
గత ఏడాది నవంబర్‌లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకలో రిషబ్‌శెట్టితో కలిసి రణవీర్‌సింగ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో కాంతార ఛాప్టర్ వన్ సినిమాతో పాటు రిషబ్ శెట్టి యాక్టింగ్‌పై రణవీర్‌సింగ్ ప్రశంసలు కురిపించాడు. కాంతార ఛాప్టర్ వన్‌లో రిషబ్ శెట్టి చేసిన దైవ కోల ట్రెడిషన్‌ను స్టేజ్‌పై అనుకరించారు రణవీర్‌సింగ్. అదే అతడిని చిక్కుల్లోకి నెట్టింది. దైవకోల సంప్రదాయాన్ని రణవీర్‌సింగ్ అవమానించాడంటూ కన్నడ అభిమానులు ఈ బాలీవుడ్ హీరోపై ఫైర్ అయ్యారు. రణవీర్ రీక్రియేషన్‌లో కామెడీ తప్ప గౌరవభావం ఎక్కడ కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్టల్ ప్రజల ఆరాధ్యదైవమైన చాముండి దేవిని రణవీర్‌సింగ్ దయ్యంతో పోల్చారంటూ విమర్శలు గుప్పించారు. రిషబ్ శెట్టి వారిస్తున్న వినకుండా రణవీర్‌సింగ్ దైవకోల ను ఎగతాళి చేశాడంటూ ఫ్యాన్స్ ఈ బాలీవుడ్ హీరోను ట్రోల్ చేశారు.
సరదా కాస్త...
సరదాగా చేసిన మిమిక్రీ కాస్త వివాదానికి దారితీయడంతో రణవీర్‌సింగ్ దిగొచ్చారు. రిషబ్‌బెట్టి తో పాటు కన్నడ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. కన్నడ సంప్రదాయాలను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. అయినా కూడా కన్నడ ఫ్యాన్స్ అతడిని వదిలిపెట్టలేదు.
హిందువుల మనోభావాలు...
రణవీర్‌సింగ్ కామెంట్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ప్రశాంత్ మేథిల్ అతడిపై గురువారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా దైవదూషణకు రణవీర్‌సింగ్ పాల్పడ్డాడంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పలు సెక్షన్ల కింద రణవీర్‌సింగ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేయడం ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026

Ranveer Singh | కాంతారా వివాదం.. క్షమాపణలు చెప్పిన రణ్వీర్ సింగ్.. నాలుగువారాల్లో ఆలయ సందర్శన..!
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



