త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | స్టేజ్‌పైనే త‌మ‌న్నాకు ముద్దుపెట్టిన అభిమాని – వీడియో వైర‌ల్‌

ప‌బ్లిక్ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే అంద‌రి ముందే త‌మ‌న్నాకు ఓ అభిమాని ముద్దుపెట్టింది. ఆ అభిమాని ముద్దుకు త‌మ‌న్నా కూడా హ్యాపీగా ఫీలైంది.

N

Entertainment | Published On Mar 14, 2026, 4.36 pm IST

Tamannaah | స్టేజ్‌పైనే త‌మ‌న్నాకు ముద్దుపెట్టిన అభిమాని – వీడియో వైర‌ల్‌
Advertisement

Tamannaah |  ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని ప‌రిణామాల కార‌ణంగా అభిమానుల మ‌ధ్య‌లోకి రావ‌డానికే హీరోయిన్లు భ‌య‌ప‌డిపోతున్నారు.బౌన్స‌ర్లు, భారీ సెక్యూరిటీ ఉన్నా ఫ్యాన్స్ అత్యుత్సాహం కార‌ణంగా హీరోయిన్ల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. కానీ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చేసిన ఓ ప‌ని మాత్రం అభిమానుల మ‌న‌సుల‌ను గెల‌చుకుంది. ఇటీవ‌ల వెల్‌టెక్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఓ వేడుక‌లో త‌మ‌న్నా పాల్గొన్న‌ది. ఈ ఈవెంట్‌లో స్టూడెంట్స్‌తో క‌లిసి స్టేజ్‌పై త‌మ‌న్నా స్టెప్పులు వేసింది. త‌మ‌న్నాతో క‌లిసి డ్యాన్స్ చేసిన ఓ అమ్మాయి మీకు ఓ ముద్దు పెట్టొచ్చా అంటూ త‌మ‌న్నాను రిక్వెస్ట్ చేసింది. అందుకు త‌మ‌న్నా ఓకే చెప్ప‌డంతో మిల్కీ బ్యూటీ బుగ్గ‌పై ఆ అభిమాని ఓ ముద్దు ఇచ్చింది. త‌న క‌ల తీర‌డంతో ఆ అభిమాని ఆనందం ప‌ట్ట‌లేక‌పో స్టేజ్‌పైనే గంతులు వేసింది. ఆ లేడీ ఫ్యాన్‌ సంతోషానికి త‌మ‌న్నా కూడా ఫిదా అయ్యింది. ఆమెకు తాను కూడా తిరిగి ముద్దు పెట్టింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

త‌మ‌న్నా సింప్లిసిటీ...

త‌మ‌న్నా సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె మ‌న‌సు బంగారం అంటూ కామెంట్లు పెడుతోన్నారు. అభిమానుల‌కు త‌మ‌న్నా ఇచ్చే విలువ‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

పురుష‌న్‌...

ప్ర‌స్తుతం త‌మ‌న్నా త‌మిళంలో పురుష‌న్‌ సినిమా చేస్తోంది. అరాణ్మ‌ణై 4 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత త‌మ‌న్నా, సుంద‌ర్ సి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ మూవీలో విశాల్ హీరోగా న‌టిస్తోన్నాడు. తెలుగులో మొగుడు పేరుతో రిలీజ్ అవుతోంది. త‌మ‌న్నా ఆశ‌ల‌న్నీ మొగుడుపైనే ఉన్నాయి.

ఇరుముడిలో...

మ‌రోవైపు ర‌వితేజ ఇరుముడిలో త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే మేక‌ర్స్ మాత్రం ఈ రూమ‌ర్ల‌పై క్లారిటీ ఇవ్వ‌లేదు.ఇటీవ‌లే ఓ రోమియో మూవీతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది త‌మ‌న్నా. షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించిన ఈ మూవీలో రెమ్యూన‌రేష‌న్ లేకుండా త‌మ‌న్నా న‌టించింద‌ట‌.

 

View this post on Instagram

 

A post shared by AltBollywood (@alt_bollywood)

Advertisement
Advertisement