త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ott Review | కుట్రం పురింధ‌వ‌న్ రివ్యూ – త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

Ott Review | ప‌శుప‌తి, విదార్థ్ ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ వెబ్ సిరీస్‌ (Web Series) కుట్రం పురింధ‌వ‌న్ ( (Kuttram Purindhavan)సోనీలివ్ ఓటీటీలో (Ott) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ తెలుగులోనూ రిలీజైంది.

N

Entertainment | Published On Dec 9, 2025, 10.31 am IST

Ott Review | కుట్రం పురింధ‌వ‌న్ రివ్యూ – త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

కుట్రం పురింధవన్ రివ్యూ

Advertisement

Ott Review | కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ప‌శుప‌తితో పాటు విదార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ వెబ్‌సిరీస్ (Web Series) కుట్రం పురింధ‌వ‌న్‌ (Kuttram Purindhavan). క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు సెల్వ‌మ‌ణి మునియ‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌ల సోనీలివ్ ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ రిలీజైంది.ఏడు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
చేయ‌ని త‌ప్పుకు...
భాస్క‌ర్ (ప‌శుప‌తి) గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో ఫార్మ‌సిస్ట్‌గా ప‌నిచేస్తుంటాడు. రిటైర్‌మెంట్‌కు ద‌గ్గ‌ర‌లో ఉంటాడు. కూతురు చ‌నిపోవ‌డంతో మ‌న‌వ‌డు రాహుల్‌బాధ్య‌త భాస్క‌ర్‌తో పాటు అత‌డి భార్య ఆనందిపై ప‌డుతుంది. రాహుల్ అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు. స‌ర్జ‌రీ చేస్తేనే బ‌తుకుతాడ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. రిటైర్‌మెంట్ త‌ర్వాత వ‌చ్చిన డ‌బ్బుల‌తో మ‌న‌వ‌డికి వైద్యం చేయించాల‌ని భాస్క‌ర్‌ అనుకుంటాడు.
భాస్క‌ర్ ప‌క్కింట్లో ఉండే సాల్మన్ హ‌త్య‌కు గుర‌వుతాడు. సాల్మన్ కూతురిని మెర్సీ మిస్స‌వుతుంది. మ‌రోవైపు గౌత‌మ్ (విదార్థ్‌) ఓ కానిస్టేబుల్‌. గ‌తంలో జ‌రిగిన ఓ త‌ప్పు కార‌ణంగా డ్రైవ‌ర్‌గా డీమోట్ అవుతాడు. పెద్ద కేసును సాల్వ్ చేసి తిరిగి ప్ర‌మోష‌న్ పొందాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. ఎన్ని అవ‌మానాలు ఎదురైన భ‌రిస్తుంటాడు. ఇంత‌లోనే క‌నిపించ‌కుండాపోయిన‌ మెర్సీ చ‌నిపోతుంది. ఆమె శ‌వాన్ని త‌న ఇంట్లోని ఫ్రిజ్‌లో భాస్క‌ర్ ఎవ‌రికి క‌నిపించ‌కుండా దాచిపెడ‌తాడు. అస‌లు మెర్సీని ఎవ‌రు చంపారు? ఆ చిన్నారి శ‌వాన్ని భాస్క‌ర్ ఎందుకు దాచిపెడ‌తాడు? భాస్క‌ర్‌ను గౌత‌మ్ ఎందుకు అనుమానించాడు? మెర్సీ మిస్సింగ్ గురించి భాస్క‌ర్ పోలీసుల‌కు చెప్పిన అబ‌ద్ధం ఏమిటి?.గౌత‌మ్ స‌హాయంతో అస‌లైన కిల్ల‌ర్‌ను భాస్క‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడు? ప్ర‌తి జాత‌ర‌కు ఆ ఊళ్లో చిన్నారుల మిస్సింగ్‌కు ఈ కిల్ల‌ర్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.
కుట్రం పురింధ‌వ‌న్ వెబ్‌సిరీస్‌... ట్విస్ట్‌, ట‌ర్న్‌ల‌తో చివ‌రి వ‌ర‌కు ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. ఓ ముగ్గురి అమాయ‌కుల‌ జీవితాలు.. ఓ కిల్ల‌ర్ కార‌ణంగా ఎలాంటి మ‌లుపులు తిరిగాయి? తాము చేయ‌ని త‌ప్పుల‌కు వారు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్నార‌న్న‌ది థ్రిల్లింగ్‌గా ఈ సిరీస్‌లో ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ సెల్వ‌మ‌ణి మునియ‌ప్ప‌న్‌.మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ సాగుతుంది. ప్ర‌తి ఎపిసోడ్ ఆడియెన్స్ ఊహ‌ల‌కు అంద‌ని మ‌లుపుల‌తో న‌డిపించ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడు.
క్యారెక్ట‌ర్స్ ఇంట్ర‌డ‌క్ష‌న్ పేరుతో సిరీస్‌ను సాగ‌దీయ‌కుండా ఫ‌స్ట్ ఎపిసోడ్‌లోనే సాల్మ‌న్ హ‌త్య‌కావ‌డం, మెర్సీ మిస్సింగ్‌తో నేరుగా క‌థ‌లోకి వెళ్లాడు డైరెక్ట‌ర్‌. మిస్స‌యింద‌నుకున్న మెర్సీ డెడ్‌బాడీని భాస్క‌ర్ దాచిపెట్టాడ‌నే ట్విస్ట్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తుంది. పాప శ‌వాన్ని దాచ‌డానికి భాస్క‌ర్ ప‌డే పాట్లు...పోలీసుల ఇన్వేస్టిగేష‌న్‌, గౌత‌మ్ సీక్రెట్ ఎంక్వైరీతో చివ‌రి వ‌ర‌కు సిరీస్ ఉత్కంఠ‌ను పంచుతుంది భాస్క‌ర్ చంపాడా? కిల్ల‌ర్ మ‌రొక‌రా? అనే స‌స్పెన్స్‌ను చివ‌రి వ‌ర‌కు మెయింటేన్ చేశాడు. అస‌లైన హంతుకుడు ఎవ‌ర‌న్న‌ది రివీల‌య్యే తీరు ఆస‌క్తిని పంచుతుంది.
పోటాపోటీగా...
భాస్క‌ర్ పాత్ర‌లో ప‌శుప‌తి జీవించేశాడు. ఓవైపు త‌న మ‌న‌వ‌డినికి కాపాడుకోవ‌డానికి ఆరాట‌ప‌డుతూనే చేయ‌ని త‌ప్పుకు ప‌శ్చాత్తాపంతో ర‌గిలిపోయే వ్య‌క్తి పాత్ర‌లో ఎమోష‌న్స్ పండించిన తీరు బాగుంది. వృత్తి నిర్వ‌హ‌ణ‌లో కానిస్టేబుల్ల జీవితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది గౌత‌మ్ పాత్ర ద్వారా అర్థ‌వంతంగా చూపించాడు డైరెక్ట‌ర్‌. లిజీ ఆంటోనీ, ల‌క్ష్మిప్రియా చంద్ర‌మౌళితో పాటు మిగిలిన వారి న‌ట‌న ప‌ర్వాలేదు.
క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌ను ఇష్ట‌ప‌డే వారిని ఈ వెబ్‌సిరీస్ మెప్పిస్తుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement