త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kriti Sanon | విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ – ర‌ష్మిక రిక‌మండేష‌నా?

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ తెలుగులో మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మైథ‌లాజిక‌ల్ రివేంజ్ సినిమాలో కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Apr 30, 2026, 11.20 am IST

Kriti Sanon | విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ – ర‌ష్మిక రిక‌మండేష‌నా?
Advertisement

Kriti Sanon | విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో సాగే రివేంజ్ యాక్ష‌న్ డ్రామా కోసం ప‌లువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానుంది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌ట‌.

బాలీవుడ్ బ్యూటీ...

ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ ఎంపికైన‌ట్లు స‌మాచారం. హిందీతో పాటు ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన క‌థానాయిక కోసం అన్వేషించిన మేక‌ర్స్ చివ‌ర‌కు కృతి స‌న‌న్‌ను ఫైన‌ల్ చేశార‌ట‌.

మ‌హేష్‌బాబు సినిమాతో....

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కృతి స‌న‌న్ యాక్టింగ్ జ‌ర్నీ తెలుగు సినిమాల‌తోనే మొద‌లైంది. మ‌హేష్ బాబు వ‌న్ నేనొక్క‌డినే మూవీతోనే తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య దోచేయ్‌తో పాటు ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.
తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీతో మూడేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో గ్లామ‌ర్‌తో పాటు యాక్ష‌న్ ప్ర‌ధానంగా కృతి స‌న‌న్ రోల్ సాగ‌నుంద‌ని అంటున్నారు.

ర‌ష్మిక రిక‌మండేష‌న్‌...

ర‌ష్మిక మంద‌న్న రిక‌మండేష‌న్‌తోనే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో కృతి స‌న‌న్‌కు హీరోయిన్‌గా ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్ క‌లిసి బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2లో న‌టిస్తున్నారు. జూన్ 19న ఈ రొమాంటిక్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్‌లోనే ర‌ష్మిక‌, కృతిస‌న‌న్ మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ బ‌ల‌ప‌డింద‌ట‌. ఆ బాండింగ్‌తోనే విజ‌య్ సినిమాలో హీరోయిన్‌గా కృతి స‌న‌న్ పేరును ర‌ష్మిక సూచించిన‌ట్లు చెబుతున్నారు.
హాయ్ నాన్న బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను వైరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

 

Advertisement
Advertisement