Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
బాలీవుడ్‌లోని వివక్షపై హీరోయిన్ కృతి సనన్ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా సెట్స్‌లో హీరోహీరోయిన్లను గౌరవించే తీరు, కల్పించే సౌకర్యాల విషయంలో చాలా తేడాలు ఉంటాయని అన్నది. స్టార్ కిడ్స్ కారణంగా తాను చాలా అవకాశాలు కోల్పోయానని చెప్పింది.
Entertainment | Published On May 10, 2026, 3.18 pm IST
Kriti Sanon | స్టార్ కిడ్స్ వల్ల బాలీవుడ్‌లో తాను చాలా అవకాశాలు కోల్పోయానని హీరోయిన్ కృతి సనన్ అన్నది. రెమ్యూనరేషన్లు, గౌరవ మర్యాదలు...ఇలా ప్రతి విషయంలో హీరోయిన్లపై వివక్ష కనిపిస్తూనే ఉంటుందని చెప్పింది. కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్ 2 మూవీ జూన్ 19న థియేటర్లలోకి రాబోతుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న మరో హీరోయిన్‌గా నటిస్తోంది. షాహిద్ కపూర్ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక మందన్న లెస్బియన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నెపోటిజం...
కాక్ టెయిల్ 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కృతి సనన్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నెపోటిజం బాధితురాలినేనని చెప్పింది. మిమి సినిమాకు ముందు ఐదేళ్లు తన కెరీర్ ఎంతో కష్టంగా సాగిందని అన్నది. "టాలెంట్, ఏదో చేయగలననే తపన ఉండి కూడా అవకాశాలు కోసం రోజులు, నెలల తరబడి ఎదురుచూశా. కొన్ని మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ స్టార్స్ కిడ్స్ కారణంగా చివరి నిమిషంలో నన్ను పక్కనపెట్టారు. నెపోటిజం వల్ల నాకు చాలానే అన్యాయం జరిగింది. వారసులతో పోటీపడి ఒక్కో అవకాశాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడాల్సివచ్చేది. వాటికి తోడు కెరీర్ ఆరంభంలో నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల పరాజయాలు ఎదురయ్యాయి. దాంతో చాలా ఒత్తిడికి లోనయ్యా. ఈ కష్టాలు, పరాజయాలే నాకు అనుభవ పాఠాలుగా ఉపయోగపడ్డాయి. కెరీర్‌లో ధైర్యంగా ఎలా ముందుకు సాగాలో నేర్పించాయి" అని తెలిపింది.
వివక్ష ఎక్కువే...
బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష చాలా ఉంటుందని అన్నది. సినిమా బడ్జెట్ తగ్గించాలని నిర్మాతలు అనుకుంటే మొదట హీరోయిన్ల రెమ్యూనరేషన్లనే తగ్గిస్తుంటారని అన్నది. హీరోల రెమ్యూనరేషన్లలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని అన్నది. సెట్స్‌లో షూటింగ్ టైమ్‌లో హీరోల కంటే ముందే హీరోయిన్లు మేకప్‌లు వేసుకొని రెడీగా ఉండాలని చెబుతుంటారని, కానీ హీరోలు మాత్రం హీరోయిన్ల కోసం ఎదురుచూడటం తక్కువేనని అన్నది. సెట్స్‌లో హీరోహీరోయిన్లను గౌరవించే తీరు, కల్పించే వసతుల విషయంలో చాలానే తేడాలు ఉంటాయని అన్నది. హీరోలు ఎది అడిగినా సమకూర్చుతుంటారని, అదే హీరోయిన్లకు వచ్చే సరికి కండీషన్లు పెడుతుంటారని కృతి సనన్ అన్నది. కృతి సనన్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



