త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kriti Sanon | కృతి స‌న‌న్ ల‌వ్‌స్టోరీకి బ్రేక‌ప్ – మ‌రో అమ్మాయితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రియుడు

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కృతి స‌న‌న్ ల‌వ‌ర్ క‌బీర్ బాహియా మ‌రో అమ్మాయితో క‌లిసి క‌నిపించిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్లు కృతి స‌న‌న్‌, క‌బీర్ బాహియా విడిపోయారంటూ కామెంట్లు, పోస్ట్‌లు పెడుతోన్నారు.

N

Entertainment | Published On Jun 29, 2026, 4.33 pm IST

Kriti Sanon | కృతి స‌న‌న్ ల‌వ్‌స్టోరీకి బ్రేక‌ప్ – మ‌రో అమ్మాయితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రియుడు
Advertisement

Kriti Sanon | కాక్ టెయిల్ 2 మూవీతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది బాలీవుడ్ హీరోయిన్ కృతి స‌న‌న్‌. రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో బోల్డ్‌ రోల్‌లో క‌నిపించి అభిమానుల‌ను మెప్పించింది. జెన్‌జీ యువ‌తిగా కృతి స‌న‌న్ పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరు, ఆమె యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు వ‌స్తోన్నాయి. థియేట‌ర్ల‌లో కాక్ టెయిల్ 2 వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

తెగ‌తెంపులు...

కాక్ టెయిల్ 2 స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న కృతిస‌న‌న్ తాజాగా బ్రేక‌ప్ రూమ‌ర్ల‌తో వార్త‌ల్లో నిలిచింది. ప్రియుడు క‌బీర్ బాహియాతో ఈ బాలీవుడ్ బ్యూటీ తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు హిందీ సినీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో అమ్మాయితో క‌లిసి క‌బీర్ క‌నిపించిన‌ ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వెర‌ల్ అవుతోంది. కృతితో ప్రేమ‌లో ఉండ‌గానే మ‌రికొంద‌రు అమ్మాయిల‌తో క‌బీర్ స‌న్నిహిత సంబంధాల‌ను కొన‌సాగించాడ‌ట‌. ఈ ఎఫైర్లు బ‌య‌ట‌ప‌డ‌టంతోనే ప్రియుడిని కృతిస‌న‌న్ దూరం పెట్టిన‌ట్లు చెబుతోన్నారు. ఈ పుకార్ల‌పై కృతి స‌న‌న్ సైలెంట్‌గా ఉండ‌టంతో బ్రేక‌ప్ క‌న్ఫామ్ అని ఫిక్స‌య్యారు.

నిజం లేదు...

కానీ ఈ బ్రేక‌ప్‌ రూమ‌ర్ల‌లో నిజం లేద‌ట‌. క‌బీర్‌తో ఉన్న ఆ అమ్మాయి అత‌డి ఫ్యామిలీ ఫ్రెండ్ అని అంటున్నారు. కృతి స‌న‌న్‌కు కూడా ఆమె ప‌రిచ‌య‌మేన‌ట‌. ఆ ఫొటో ఆధారంగా క‌బీర్ వ్య‌క్తిత్వంపై నింద‌లు వేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అత‌డి స‌న్నిహితులు చెబుతోన్నారు. కృతి, క‌బీర్ విడిపోయిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌లు అబ‌ద్ద‌మేన‌ని పేర్కొన్నారు. వారి బంధంలో ఎలాంటి మార్పు లేద‌ని చెప్పారు.

ధోనీకి స‌న్నిహితుడు...

క‌బీర్ బాహియా కుటుంబానికి లండ‌న్‌లో ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్‌లు ఉన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి స‌న్నిహితుడైన క‌బీర్ గ‌త రెండేళ్లుగా కృతి స‌న‌న్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ట‌. సోద‌రి నుపుర్ స‌న‌న్ కార‌ణంగా కృతికి ఈ బిజినెస్‌మెన్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. కృతి, క‌బీర్ గ్రీస్‌, ఇట‌లీకి వెకేష‌న్ వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ సీక్రెట్ ల‌వ్‌స్టోరీపై మాత్రం కృతి ఇప్ప‌టివ‌ర‌కు రియాక్ట్ కాలేదు.
రామ్‌చ‌ర‌ణ్ సినిమా...

కాగా కాక్ టెయిల్ 2 త‌ర్వాత కృతి స‌న‌న్ తెలుగులో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ మూవీలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

Advertisement
Advertisement