Krithi Shetty | టాలీవుడ్‌లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ – రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీతో కృతి శెట్టి టాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వబోతుంది. జూన్ నెలాఖరు నుంచే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట. ఫస్ట్ షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్, కృతి శెట్టి లవ్ ట్రాక్‌ను షూట్ చేయబోతున్నారట.
Entertainment | Published On Jun 5, 2026, 6.25 pm IST
Krithi Shetty | ఉప్పెన మూవీతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కృతి శెట్టి. ఈ ప్రేమకథా చిత్రంలో బేబమ్మగా నాచురల్ యాక్టింగ్‌తో తొలి సినిమాతోనే అభిమానుల మనసులను దోచుకుంది. వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఉప్పెన సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఉప్పెన తర్వాత కృతి శెట్టి చాలానే సినిమాలు చేసింది. కానీ లక్ మాత్రం కలిసిరాలేదు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో టాలీవుడ్‌కు దూరమైంది. 2024లో వచ్చిన మనమే తర్వాత తెలుగులో సినిమా చేయలేదు కృతి శెట్టి.
మల్టీస్టారర్...
అవకాశాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తోన్న ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్‌ను దక్కించుకోంది. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో ఓ హీరోయిన్‌గా కనిపించబోతుంది. మన శంకర వరప్రసాద్‌గారు బిగ్గెస్ట్ హిట్ తర్వాత వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించబోతున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించబోతుంది.
కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో జరుగనున్న ఫస్ట్ షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్, కృతిశెట్టి లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్లను డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారట. కృతి శెట్టి డిజాస్టర్లకు అనిల్ రావిపూడి మూవీతో బ్రేక్ పడటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తోన్నారు.
కీర్తి సురేష్...
ఈ మల్టీస్టారర్ మూవీ షూటింగ్‌లో జూలై లేదా ఆగస్ట్ నుంచి వెంకటేష్ జాయిన్ కానున్నట్లు సమాచారం. వెంకటేష్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనున్నట్లు చెబుతోన్నారు.
జనవరి 13 విడుదల...
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మూవీకి జనవరి 13 విడుదల అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ఐదో మూవీ ఇది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పాలమూరు జిల్లాలో నీ జెండా ఎగరనివ్వను.. కేసీఆర్‌ను హెచ్చరించిన సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Janhvi Kapoor | వామ్మో...జాన్వీ కపూర్ హ్యాండ్‌బ్యాగ్ ధర అన్ని లక్షలా?
- ●CM Revanth Reddy | కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- ●Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
- ●Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై

CM Revanth Reddy | పాలమూరు జిల్లాలో నీ జెండా ఎగరనివ్వను.. కేసీఆర్‌ను హెచ్చరించిన సీఎం రేవంత్

CM Revanth Reddy | పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు : సీఎం రేవంత్ రెడ్డి

Janhvi Kapoor | వామ్మో...జాన్వీ కపూర్ హ్యాండ్‌బ్యాగ్ ధర అన్ని లక్షలా?

CM Revanth Reddy | కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు






