త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balakrishna | అఫీషియ‌ల్…. క్రేజీ కాంబో సెట్ – పొలిటిక‌ల్ స్టోరీతో బాల‌కృష్ణ‌, కొర‌టాల శివ సినిమా

బాల‌కృష్ణ‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాపై శుక్ర‌వారం అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఓ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ పాన్ ఇండియ‌న్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On May 1, 2026, 2.57 pm IST

Balakrishna | అఫీషియ‌ల్…. క్రేజీ కాంబో సెట్ – పొలిటిక‌ల్ స్టోరీతో బాల‌కృష్ణ‌, కొర‌టాల శివ సినిమా
Advertisement

Balakrishna |  బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ సెట్ట‌యిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌ను నిజం చేస్తూ బాల‌కృష్ణ‌, కొర‌టాల శివ సినిమాపై శుక్ర‌వారం అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోస్ట‌ర్‌తో ఈ సెన్సేష‌న‌ల్ మూవీని మేక‌ర్స్‌ ప్ర‌క‌టించారు.

అధికారానికి ఆశ‌యం తోడైతే....

కొర‌టాల శివ‌తో దేవ‌ర సినిమాను నిర్మించిన యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే బాల‌కృష్ణ కొత్త సినిమా రూపొందుతోంది. అధికారానికి ఆశ‌యం తోడైతే.... అదొక ఉద్య‌మంగా మారుతుంది అంటూ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లోని క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ క్యాప్ష‌న్ చూస్తుంటే పొలిటిక‌ల్ జాన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. కొర‌టాల శివ మార్క్ బ‌ల‌మైన సామాజికాంశాల‌తో కూడిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌, కొర‌టాల శివ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 112వ సినిమా ఇది

దేవ‌ర 2 ప్లేస్‌లో...

బాల‌కృష్ణ మూవీ ప్లేస్‌లో ఎన్టీఆర్‌తో దేవ‌ర 2 సినిమా చేయాల్సింది కొర‌టాల శివ‌. కానీ ప్ర‌శాంత్ నీల్‌తో ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చేస్తోన్న డ్రాగ‌న్ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఆ ఎఫెక్ట్ దేవ‌ర సీక్వెల్‌పై ప‌డింది. దాంతో దేవ‌ర 2న ప‌క్క‌న‌పెట్టిన కొర‌టాల శివ ఈ గ్యాప్‌లో బాల‌కృష్ణ కోసం ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసిన‌ట్లు స‌మాచారం.

యాక్ష‌న్ మూవీ...

ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ఓ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు బాల‌కృష్ణ‌. వీర‌సింహారెడ్డి త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. తొలుత ఈ సినిమా కోసం ఓ హిస్టారిక‌ల్ క‌థ‌ను అందుకున్నారు. కానీ బ‌డ్జెట్ ఎక్కువ కావ‌డంతో హిస్టారిక‌ల్ కాన్సెప్ట్‌ను ప‌క్క‌న పెట్టి గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ‌తో బాల‌కృష్ణ సినిమా చేస్తోన్నారు గోపీచంద్ మ‌లినేని. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

Advertisement
Advertisement