Horror Movie | కిరణ్ అబ్బవరం సినిమాలో బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ – హారర్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ తనూజ హారర్ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఈ హారర్ సినిమాకు హతః అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Aug 31, 2026, 1.39 pm IST
Horror Movie | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ తనూజ పుట్టస్వామి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హారర్ సినిమా చేస్తోంది. టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఈ మూవీ టైటిల్‌ను సోమవారం అనౌన్స్ చేశారు. ఈ హారర్ మూవీకి హతః అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో తనూజతో పాటు కుష్లూ మద్దాల, నమ్రితా ఎమ్‌వీ , రెహమాన్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
టైటిల్ గ్లింప్స్...
సోమవారం టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. నల్లపిల్లిని చూపిస్తూ ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. పిల్లి బతికి ఉందా? చనిపోయిందా? అంటూ ఈ వీడియోలో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులో తెరపై ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు భయపెడుతూనే ఉంటుందని మేకర్స్ అన్నారు.
రెండో సినిమా...
ఈ వీడియో గ్లింప్స్‌లో హీరోహీరోయిన్లను చూపించలేదు. తనూజ రోల్ ఏమిటన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. హత మూవీకి అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి స్వీయ నిర్మాణ సంస్థ క ప్రొడక్షన్స్‌పై కిరణ్ అబ్బవరం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ తర్వాత కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న సెకండ్ మూవీ ఇది.
పార్ట్ టైమర్స్...
ఇటీవలే తనూజ పార్ట్ టైమర్స్ అనే వెబ్‌సిరీస్ చేసింది. ఇండిపెండెంట్ బిజినెస్ఉమెన్స్‌గా రాణించాలని కలలు కన్న ఇద్దరు యువత జీవన ప్రయాణంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగులో సీరియల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన తనూజ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9తో ఫేమస్ అయ్యింది. ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న – ఇన్‌స్టా పోస్ట్‌తో గుడ్‌న్యూస్
ఆగస్టు 30, 2026

Mla Raja Singh | అశ్లీలత, అసభ్యత తప్ప కథ లేదు – యశ్ టాక్సిక్‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్
ఆగస్టు 30, 2026

Allari Naresh | భక్తి కథతో అల్లరి నరేష్ మూవీ – హీరోయిన్‌గా కాజల్ – షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓటీటీ డీల్ క్లోజ్
ఆగస్టు 30, 2026
తాజావార్తలు
- ●Delhis Draft Electoral Roll | ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి 47.7 లక్షల పేర్లు తొలగింపు
- ●Glacier Collapse Video | కళ్లముందే కరిగిపోయిన మంచుకొండ.. నేపాల్ వరదల భయానక దృశ్యాలు డ్రోన్‌లో రికార్డ్
- ●Tata Sons | టాటా సన్స్ ఏజీఎంకు డిసెంబర్ వరకు గడువు.. సెప్టెంబర్ 17న కీలక నిర్ణయం..?
- ●Supreme Court | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని కచ్చితంగా వెల్లడించాలి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- ●Debt Management | అప్పులు పెరుగుతున్నాయా? ఇలా అదుపులో పెట్టండి..
- ●Errolla Srinivas | అడ్లూరి లక్ష్మణ్ కాదు.. అబద్దాల లక్ష్మణ్‌గా మారిపోయిండు

Delhis Draft Electoral Roll | ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి 47.7 లక్షల పేర్లు తొలగింపు

Glacier Collapse Video | కళ్లముందే కరిగిపోయిన మంచుకొండ.. నేపాల్ వరదల భయానక దృశ్యాలు డ్రోన్‌లో రికార్డ్

Tata Sons | టాటా సన్స్ ఏజీఎంకు డిసెంబర్ వరకు గడువు.. సెప్టెంబర్ 17న కీలక నిర్ణయం..?

Supreme Court | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని కచ్చితంగా వెల్లడించాలి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం



