త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayan Sarika | డీజే టిల్లు హీరోతో న‌య‌న్ రొమాన్స్ – సుకుమార్ ప్రొడ్యూస‌ర్‌

రాకాస , ఆయ్ సినిమాల ఫేమ్ న‌య‌న్ సారిక తెలుగులో మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత‌గా రాబోతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది. ఇందులో హీరో ఎవ‌రంటే?

N

Entertainment | Published On Nov 5, 2026, 4.00 pm IST

Nayan Sarika | డీజే టిల్లు హీరోతో న‌య‌న్ రొమాన్స్ – సుకుమార్ ప్రొడ్యూస‌ర్‌
Advertisement

Nayan Sarika | రాకా బ్యూటీ న‌య‌న్ సారిక తెలుగులో మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతుంది. మిస్టేక్ అనే చిన్న సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మ‌హారాష్ట్ర బ్యూటీ. ఆయ్‌, క, రాకాస సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌ల‌ను అందుకుంది. ఈ విజ‌యాల‌తో న‌య‌న్ సారిక పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. సినిమాల ఎంపిక‌లో వైవిధ్యంగా అడుగులు వేస్తోన్న న‌య‌న్ తాజాగా మ‌రో ల‌క్కీ ఛాన్స్ అందుకుంది.

సుకుమార్ రైటింగ్స్‌...

2024లో వ‌చ్చిన టిల్లు స్క్వేర్ త‌ర్వాత మంచి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ తాజాగా ఓ కొత్త ద‌ర్శ‌కుడు బాబీతో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. న‌వంబ‌ర్ 11న అఫీషియ‌ల్‌గా ఈ మూవీ లాంఛ్ కాబోతుంది. సుకుమార్ రైటింగ్స్ ప‌తాకంపై అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.

మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా...

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌కు జోడీగా న‌య‌న్ సారిక క‌నిపించ‌బోతుంది. గ‌త సినిమాల్లో ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించిన ఈ బ్యూటీ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ మూవీలో మాత్రం మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సుకుమార్ బంధువు...

డైరెక్ట‌ర్ బాబీ...సుకుమార్‌కు బంధువు అవుతార‌ని స‌మాచారం. ఈ సినిమాలో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ క్యారెక్ట‌రైజేష‌న్ మాత్రం డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.
కోహినూర్‌
టిల్లు స్క్కేర్ త‌ర్వాత కోహినూర్‌, బ్యాడ్‌యాస్ అనే సినిమాల‌ను అనౌన్స్‌చేశాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. కానీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా సెట్స్‌పైకి రాక‌ముందే ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి.

Advertisement
Advertisement