Samyuktha Menon | ఓటీటీలోకి భీమ్లానాయక్ హీరోయిన్ ఎంట్రీ – డియర్ కామ్రేడ్ డైరెక్టర్‌తో పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్
తెలుగులో లక్కీ స్టార్‌గా కొనసాగుతోంది సంయుక్త మీనన్. ఇటీవలే నారి నారి నడుమ మురారితో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ టైటిల్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి.
Entertainment | Published On Mar 22, 2026, 5.39 pm IST
Samyuktha Menon | భీమ్లానాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. సంక్రాంతికి రిలీజైన నారి నారి నడుమ మురారి మూవీతో మంచి సక్సెస్ అందుకుంది సంయుక్త మీనన్. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూతో పాటు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.
గువ్వల చెరువు ఘాట్...
తాజాగా సంయుక్త మీనన్ తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గువ్వల చెరువు ఘాట్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో కిరణ్ అబ్బవరం, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో...
గువ్వల చెరువు ఘాట్ వెబ్‌సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో తిరువీర్, తేజస్వి రావు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రా అండ్ రస్టిక్‌గా డైరెక్టర్ భరత్ కమ్మ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ సిరీస్...
ఇటీవలే గువ్వల చెరువు ఘాట్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం మెదక్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. సంయుక్త మీనన్‌తో పాటు కిరణ్ అబ్బవరానికి కూడా ఇదే మొదటి వెబ్ సిరీస్ కావడం గమనార్హం.
ఈ ఏడాదే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
డియర్ కామ్రేడ్...
కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీతో డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు భరత్ కమ్మ. గువ్వల చెరువు ఘాట్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
స్వతహాగా మలయాళ అమ్మాయి అయిన సంయుక్త మీనన్ తెలుగు సినిమాలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. బింబిసార, విరూపాక్ష, సార్ విజయాలతో టాలీవుడ్‌లో లక్కీ స్టార్‌గా మారింది. సంయుక్త మీనన్ సినిమా చేస్తే హిట్టే అనే నమ్మకం ఆడియెన్స్‌తో పాటు టాలీవుడ్ వర్గాల్లో ఏర్పడింది.
సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన స్వయంభూ, స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకలు ముందుకు రానున్నాయి. మరోవైపు తమిళం, హిందీలోనూ సినిమాలు చేస్తోంది సంయుక్త మీనన్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



