త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiran Abbavaram | కిర‌ణ్ అబ్బ‌వ‌రం పొలిటిక‌ల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ – టైటిల్ ఇదే – స్ట్రీమింగ్‌ ఎందులో…ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఓ పొలిటిక‌ల్ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌కు గువ్వ‌లచెరువు ఘాట్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Feb 22, 2026, 4.50 pm IST

Kiran Abbavaram | కిర‌ణ్ అబ్బ‌వ‌రం పొలిటిక‌ల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్  – టైటిల్ ఇదే – స్ట్రీమింగ్‌ ఎందులో…ఎప్పుడంటే?
Advertisement

Kiran Abbavaram |  ఓటీటీ ట్రెండ్ కార‌ణంగా వెబ్‌సిరీస్‌ల‌కు ఆద‌ర‌ణ పెరిగింది. నిడివి ఎక్కువ కావ‌డం, సెన్సార్ ఇబ్బందులు, బోల్డ్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన వెండితెర‌పై చెప్ప‌లేని క‌థ‌ల‌ను వెబ్‌సిరీస్‌ల రూపంలో ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేక‌ర్స్‌. ఓటీటీల ద్వారా రెమ్యూన‌రేష‌న్లు, పేరు ప్ర‌ఖ్యాతులు బాగానే వ‌స్తుండ‌టంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి స్టార్లు రెడీ అంటోన్నారు.

పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో...

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ తెలుగు వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్‌కు డియ‌ర్ కామ్రేడ్ ఫేమ్ భ‌ర‌త్ క‌మ్మ షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

గువ్వ‌ల చెరువు ఘాట్‌...

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కు గువ్వ‌ల చెరువు ఘాట్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ఇంటెన్స్ స్టోరీని రెడీ చేసిన‌ట్లు స‌మాచారం. ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రం రోల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.
గువ్వ‌ల చెరువు ఘాట్ వెబ్‌సిరీస్ లాంఛింగ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ట్లు స‌మాచారం. మార్చి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్నారు.మార్చిలో అమెజాన్ ప్రైమ్ ఓ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతుంది. ఈ ఈవెంట్‌లోనే గువ్వ‌ల చెరువు ఘాట్ సిరీస్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేయ‌బోతున్నారు.

చెన్నై ల‌వ్‌స్టోరీ...

క‌, కే ర్యాంప్ సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందుకున్నారు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఈ విజ‌యాల‌తో టాలీవుడ్‌లో బిజీ అయ్యారు. చెన్నై ల‌వ్‌స్టోరీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రో నాలుగు మూవీస్ క‌మిట‌య్యాడు.

Advertisement
Advertisement