Kiara Advani | టాక్సిక్ వర్సెస్ వాన్ – భర్తతో కియారా అద్వానీ బాక్సాఫీస్ వార్
బాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా బాక్సాఫీస్ వద్ద ఒకరి సినిమాతో మరొకరు పోటీపడబోతున్నారు. కియారా నటించిన టాక్సిక్ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా... సిద్ధార్థ్ మల్హోత్రా హారర్ మూవీ వాన్ ఆగస్ట్ 28న రిలీజ్ కాబోతుంది. భార్యభర్తల్లో ఎవరూ విన్నర్‌గా నిలుస్తారన్నది ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Jun 22, 2026, 2.52 pm IST
Kiara Advani | అన్నదమ్ములు లేదంటే ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు, హీరోయిన్లు నటించిన సినిమాలు ఒకే రోజు థియేటర్లలో రిలీజైన సందర్భాలు సినీ పరిశ్రమలో చాలానే ఉన్నాయి. కానీ భర్త సినిమాతో పోటీగా భార్య మూవీ రిలీజ్ కావడం అన్నది అరుదు. బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన వేర్వేరు సినిమాలు ఒకే వారం థియేటర్లలోకి రానున్నాయి.
టాక్సిక్ రిలీజ్
కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ టాక్సిక్ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా రూపొందిన ఈ మూవీలో కేజీఎఫ్ స్టార్ యశ్ (Yash)రోగా నటిస్తున్నాడు. టాక్సిక్‌లో కియారా అద్వానీతో పాటు నయనతార(Nayanthara), రుక్మిణి వసంత్, తారా సుతారియా హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
కేఎజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీపై దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి. మార్చిలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదాపడింది. ఆ తర్వాత జూన్ 4 రిలీజ్ చేయాలని అనుకున్నారు. వర్కవుట్ కాలేదు. తాజాగా ఆగస్ట్ 26న టాక్సిక్ థియేటర్లలోకి రానున్నట్లు ఆదివారం మేకర్స్ ప్రకటించారు. యశ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టాక్సిక్ బాలీవుడ్‌లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు హిందీలోనూ భారీగా వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాలో యశ్‌కు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. కియారా, తారా సుతారియా, నయనతార కూడా బాలీవుడ్ ఆడియెన్స్‌కు సుపరిచితులే కావడంతో స్ట్రెయిట్ మూవీ స్థాయిలో టాక్సిక్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.
తమన్నా హారర్ మూవీ...
కాగా బాలీవుడ్‌లో యశ్ టాక్సిక్‌కు పోటీగా అదే వారం సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా నటించిన వాన్ రిలీజ్ కాబోతుంది. సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఆగస్ట్ 28న ప్రేక్షకుల వస్తోంది. భార్యాభర్తలు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ సినిమాలు రెండు రోజుల గ్యాప్‌లో ఒకే వారం థియేటర్లలోకి రానుండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఎవరూ విన్నర్‌గా నిలుస్తారన్నది ఉత్కంఠను పంచుతోంది.
బోల్డ్ రోల్...
మరోవైపు యశ్ టాక్సిక్‌లో కియారా అద్వానీ రోల్ బోల్డ్‌గా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిలీజైన ఓ పాటలో యశ్, కియారా అద్వానీ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. సినిమాలో ఇద్దరి మధ్య కొన్ని ఇంటిమేట్ సీన్లు కూడా ఉంటాయని అంటున్నారు. బోల్డ్ సీన్ల విషయంలో కియారా అద్వానీ హర్ట్ అయినట్లు, ఆ సన్నివేశాల్లో మార్పులు చేయమని కోరినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ రూమర్లను కియారా ఖండించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sara Arjun | సద్గురు ‘ఇషా ఆశ్రమం’ నా సెకండ్ హోమ్.. అక్కడికే పరుగెత్తుకుంటూ వెళ్తా: నటి సారా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
జూన్ 18, 2026

Sanchita Ugale | నవ్వుల వెనుక అంతులేని వేదన.. సంచిత కేసులో కీలక వివరాలు వెల్లడించిన స్నేహితురాలు
జూన్ 17, 2026

Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Minister Vakiti Srihari | మత్తు వదలండి.. మైదానాలు చేరండి.. యువతకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు
- ●Aliganj Fire Accident | లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో పైనుంచి దూకేసిన స్టూడెంట్స్
- ●Bhagyashri Borse | ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
- ●Kethavath Ramakrishna | రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణ నియామకం.. అభినందనలు తెలిపిన జాతీయ అధ్యక్షులు
- ●Komatireddy Venkat Reddy | వరదలపై వేగంగా స్పందించేందుకు ఆర్అండ్బీ స్పెషల్ ఎస్ఓపీ : మంత్రి కోమటిరెడ్డి
- ●KTR | రైతులను ఏడిపిస్తున్న సీఎంను ఎంత తిట్టినా తక్కువనే : కేటీఆర్

Minister Vakiti Srihari | మత్తు వదలండి.. మైదానాలు చేరండి.. యువతకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు

Aliganj Fire Accident | లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో పైనుంచి దూకేసిన స్టూడెంట్స్

Bhagyashri Borse | ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

Kethavath Ramakrishna | రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణ నియామకం.. అభినందనలు తెలిపిన జాతీయ అధ్యక్షులు




