త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మ‌ల్టీప్లెక్స్ గ్రాండ్‌గా లాంఛ్‌

వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ఏఏఏ సినిమాస్ ఆదివారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. త‌న మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ను అల్లు అర్జున్ స్వ‌యంగా లాంఛ్ చేశారు. ఇండియాలోనే ఫ‌స్ట్ టైమ్ వైల్డ్ ఫైర్ స్క్రీన్‌తో మ‌ల్టీప్లెక్స్ ప్రారంభ‌మైన‌ట్లు అల్లు అర్జున్ వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Aug 9, 2026, 8.19 pm IST

Allu Arjun | వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మ‌ల్టీప్లెక్స్ గ్రాండ్‌గా లాంఛ్‌
Advertisement

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు హైద‌రాబాద్‌లో రెండు మ‌ల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అమీర్‌పేట్‌లోని ఏఏఏ సినిమాస్‌తో పాటు కోకాపేట‌లో ఇటీవ‌ల అల్లు సినిమాస్ పేరుతో భారీ మ‌ల్టీప్లెక్స్‌ను లాంఛ్ చేశాడు. ఈ రెండు స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్నాయి. త‌న థియేట‌ర్ బిజినెస్‌ను విస్త‌రించిన ఐకాన్ స్టార్ వైజాగ్‌లో ఏఏఏ సినిమాస్ పేరుతో కొత్త‌ మ‌ల్టీప్లెక్స్‌ను నెల‌కొల్పారు. ఆదివారం అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ మ‌ల్టీప్లెక్స్ లాంఛ్ అయ్యింది.

గంగోత్రి టైమ్‌లో...

ఈ వేడుక‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా గంగోత్రి నుంచి చాలా సినిమాల‌ను వైజాగ్‌లో షూట్ చేశా. అలాగే నా ఎన్నో ఈవెంట్స్ వైజాగ్‌లో జ‌రిగాయి. వైజాగ్‌లో ఎప్ప‌టికైనా ఓ పెద్ద థియేట‌ర్ ప్రారంభించాల‌నే నా చిర‌కాల క‌ల నేటితో నిజ‌మ‌వ్వ‌డం ఆనందంగా, చాలా గ‌ర్వంగా ఉంది. గంగోత్రి సినిమా స‌మ‌యంలో వైజాగ్ రోడ్స్‌పై నేను న‌డిచే వాడిని. న‌న్నెవ‌రూ గుర్తు కూడా ప‌ట్టేవాళ్లు కాదు. ఇప్పుడు రోడ్డులో న‌డ‌వ‌లేక‌పోతున్నాను. ఇదొక ఇన్‌క్రెడిబుల్ జ‌ర్నీ. వైజాగ్ వ‌చ్చిన ప్ర‌తీసారి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఇండియాలో ఎక్క‌డా లేని స్పెష‌ల్ స్క్రీన్ వైల్డ్ ఫైర్‌ వైజాగ్‌లో ఏఏఏ సినిమాస్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. అంద‌రూ ఈ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను. రాకా మూవీ షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది. మ‌ల్టీప్లెక్స్ లాంఛ్‌ ఈవెంట్ కోసం ఒక‌రోజు ప‌ర్మిష‌న్ తీసుకుని వ‌చ్చా అని అన్నారు.

రాకా....

రాకా మూవీకి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీపికా ప‌డుకోణ్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాకాతో పాటు లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో అల్లు అర్జున్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

 

Advertisement
Advertisement