Hansika | విడాకుల తర్వాత ఫస్ట్ సినిమా – హారర్ మూవీతో టాలీవుడ్‌లోకి హన్సిక రీఎంట్రీ
విడాకుల తర్వాత హన్సిక ఓ కొత్త సినిమాను అంగీకరించింది. ఓ హారర్ సినిమాతో రెండేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. నారా రోహిత్ హీరోగా కపాలి పేరుతో టాలీవుడ్‌లో ఓ సైకలాజికల్ హారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటిస్తోంది. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Aug 9, 2026, 4.37 pm IST
Hansika | విడాకుల తర్వాత తెలుగులో ఓ కొత్త మూవీని అంగీకరింది హీరోయిన్ హన్సిక. హారర్ మూవీతో దాదాపు రెండేళ్ల తర్వాత టాలీవు్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లోనే సొహైల్ కథురియా అనే బిజినెస్‌మెన్‌తో ప్రేమలో పడింది హన్సిక. 2022లో ప్రియుడితో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో హన్సిక, సొహైల్ కథురియా పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.
నాలుగేళ్లకే విడాకులు...
మనస్పర్థల కారణంగా హన్సిక వైవాహిక బంధం సాఫీగా సాగలేదు. నాలుగేళ్లకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల కారణంగా గత రెండేళ్లుగా సినిమాలకు గ్యాప్ తీసుకుంది. 2024లో వచ్చిన తమిళ మూవీ గార్డియన్ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు.
హారర్ మూవీతో...
లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక ఓ బంపరాఫర్ దక్కించుకుంది. తమిళ హారర్ మూవీతో సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ మళ్లీ తెలుగు హారర్ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వబోతుంది. నారా రోహిత్ హీరోగా తెలుగులో కపాలి పేరుతో ఓ సైకలాజికల్ హారర్ మూవీ తెరకెక్కుతోంది. రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హన్సిక బర్త్‌డే సందర్భంగా ఆదివారం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్‌లో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతుఓంది. హన్సిక పోస్టర్‌లోనే దట్టమైన అడవి గుండా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతోన్నట్లుగా మరో ఫొటో కనిపిస్తోంది. హన్సిక పోస్టర్ చుట్టూ విచిత్రమైన భాషతో కూడిన ఆక్షరాలు ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశముదురుతో...
విడాకుల తర్వాత హన్సిక అంగీకరించిన తొలి మూవీ ఇదే. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. తొలి సినిమాలోనే తన గ్లామర్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది. దేశముదురు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో హన్సికకు టాలీవుడ్‌లో చాలానే ఆఫర్లు వచ్చాయి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ పోతినేని వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. కందిరీగ, దేనికైనా రెడీతో పాటు మరికొన్ని హిట్లు దక్కినా తెలుగులో స్టార్ హీరోయిన్ల లీగ్‌లో అడుగుపెట్టలేకపోయింది. తమిళంలో మాత్రం అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ – ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు
ఆగస్టు 9, 2026

Vijay Deverakonda | బోనాల వేడుక – లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు
ఆగస్టు 9, 2026

Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ – రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ – రామాయణంతో లింక్
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి కిషన్‌రెడ్డి మొక్కులు
- ●Halisahar | మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
- ●Himanshi Khurana Murder | కెనడాలో సంచలనం: భారతీయ యువతి హత్య కేసులో 7 నెలల తర్వాత దొరికిన ప్రియుడు
- ●Aviation | ఎయిర్ ఇండియా పైలట్‌కు ‘డోప్’ టెస్ట్‌లో పాజిటివ్?
- ●Medico Priyanka | మెడికో ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. ఆమెపై హత్యాయత్నం జరిగింది
- ●Varun Batchigari | అమెరికాలో ప్రియురాలిని చంపి భారత్‌కు పారిపోతుండగా.. జర్మనీలో దొరికిపోయిన ఇండియన్ స్టూడెంట్!

Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి కిషన్‌రెడ్డి మొక్కులు

Halisahar | మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Himanshi Khurana Murder | కెనడాలో సంచలనం: భారతీయ యువతి హత్య కేసులో 7 నెలల తర్వాత దొరికిన ప్రియుడు

Aviation | ఎయిర్ ఇండియా పైలట్‌కు ‘డోప్’ టెస్ట్‌లో పాజిటివ్?



