త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | టాక్సిక్‌లో బోల్డ్ సీన్ల ర‌చ్చ‌.. రూమర్లకు చెక్ పెట్టిన కియారా అద్వానీ

టాక్సిక్ మూవీలో య‌శ్‌తో క‌లిసి తాను న‌టించిన బోల్డ్ సీన్ల‌ను ట్రిమ్ చేయాలంటూ కియారా అద్వానీ మేక‌ర్స్‌ను రిక్వెస్ట్ చేసిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై కియారా రియాక్ట్ అయ్యింది. త‌న‌దైన స్టైల్‌లో బ‌దులిచ్చింది.

N

Entertainment | Published On May 4, 2026, 6.45 pm IST

Kiara Advani | టాక్సిక్‌లో బోల్డ్ సీన్ల ర‌చ్చ‌.. రూమర్లకు చెక్ పెట్టిన కియారా అద్వానీ
Advertisement

Kiara Advani |  కేజీఎఫ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత య‌శ్ హీరోగా న‌టిస్తోన్న మూవీ టాక్సిక్‌.ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి మ‌ల‌యాళ నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌తో పాటు కియారా అద్వానీ, రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

కియారా రిక్వెస్ట్‌...

కేజీఎఫ్ త‌ర్వాత య‌శ్ నుంచి వ‌స్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. కాగా టాక్సిక్‌తోనే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సాండ‌ల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవ‌ల య‌శ్‌, కియారా అద్వానీల‌పై రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు కొన్ని సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. వీటిలో కియారా కంప్లీట్ బోల్డ్ లుక్‌లో క‌నిపించింది. టాక్సిక్‌లో య‌శ్, కియారా అద్వానీ కెమిస్ట్రీ హాట్‌హాట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

ట్వీట్ వైర‌ల్....

క‌థ డిమాండ్ మేర‌కు వీరిద్ద‌రిపై కొన్ని ఇంటిమేట్ సీన్ల‌ను డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ షూట్ చేశార‌ట‌. కానీ ఫైన‌ల్ అవుట్‌పుట్ చూసిన కియారా ఆ శృంగార స‌న్నివేశాల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. త‌న ఇమేజ్‌ను దెబ్బ‌తీసేలా ఆ సీన్లు ఉన్నాయ‌ని, వాటిని తొల‌గించాలంటూ మేక‌ర్స్‌ను కియారా రిక్వెస్ట్ చేసింద‌ట‌. ఈ బాలీవుడ్ బ్యూటీ అభ్య‌ర్థ‌న‌ను ద‌ర్శ‌కురాలు ప‌ట్టించుకోలేదేని, ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు మొద‌లైన‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌పై త‌న దైన స్టైల్‌లో కియారా రియాక్ట్ అయ్యింది. ఈ రూమ‌ర్ల‌లో ఏ మాత్రం నిజం లేదంటూ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె ట్వీట్ వైర‌ల్ అవుతోంది.
య‌శ్ టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కావాల్సింది. కానీ ధురంధ‌ర్ 2తో పోటీ కార‌ణంగా వాయిదాప‌డింది. జూన్ 4కు ఈ సినిమాను వాయిదావేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ కార‌ణంగా జూన్ 4న కూడా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే రివీల్ చేస్తామ‌ని అన్నారు.

 

Advertisement
Advertisement