Kiara Advani | అప్పుడు చరణ్ – ఇప్పుడు ఎన్టీఆర్ – గాడ్ ఆఫ్ వార్‌కు హీరోయిన్ దొరికిందా?
ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్‌కు హీరోయిన్ దొరికిందా? అంటే ఔననే అంటున్నాయి. టాలీవుడ్ వర్గాలు. ఈ మైథాలజీ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఫిక్సైనట్లు సమాచారం. మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Jul 20, 2026, 5.28 pm IST
Kiara Advani | యశ్ టాక్సిక్‌లో బోల్డ్ రోల్ కారణంగా గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. టాక్సిక్ నుంచి ఇటీవలే మేకర్స్ ఓ పాటను రిలీజ్ చేశారు. ఇందులో యశ్‌తో కియారా కెమిస్ట్రీ, ఆమె అందాల ఆరబోతపై గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది. పెళ్లైన తర్వాత ఇలాంటి గ్లామరస్ రోల్‌లో కియారా కనిపించడంపై నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. డబ్బుల కోసమే కియారా బోల్డ్ రోల్స్‌లో నటించడానికి అంగీకరిస్తుందంటూ కామెంట్లు పెడుతోన్నారు. ఈ విమర్శలను పట్టించుకోకుండా ఇటీవలే భర్తతో కలిసి ఈ బాలీవుడ్ బ్యూటీ ఫారిన్‌కు వెకేషన్‌కు వెళ్లింది.
మైథాలజీ మూవీ....
టాక్సిక్ రిలీజ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ తెలుగులో బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. తెలుగులో ఓ మైథాలజీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవల ఓ పాన్ ఇండియన్ మూవీ అనౌన్స్ అయ్యింది. యుద్ద దేవుడిగా పురాణాలు పేర్కొన్న కుమారస్వామి కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ రూపొందుతోంది.
కియారా అద్వానీ....
గాడ్ ఆఫ్ వార్‌లో హీరోయిన్ ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. రేసులో చాలా మందే హీరోయిన్లు పేర్లు వినిపించాయి. చివరకు కియారా అద్వానీని ఫిక్స్ చేసినట్లు సమాచారం. తెలుగులో ఇప్పటివరకు మహేష్‌బాబుతో భరత్ అనే నేను, రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామా, గేమ్ ఛేంజర్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ఈ బ్యూటీ నటించబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గాడ్ ఆఫ్ వార్‌లో మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తెలుగులో నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో సినిమా చేసింది మంజిమా మోహన్. లాంగ్ గ్యాప్ తర్వాత గాడ్ ఆఫ్ వార్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో గాడ్ ఆఫ్ వార్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నలుగురు హీరోయిన్లు...
కాగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన టాక్సిక్ ఆగస్ట్ 26న రిలీజ్ కాబోతుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కూడా నటించబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






