Kiara Advani | యశ్ టాక్సిక్ స్పెషల్ అప్‌డేట్ – కియారా అద్వానీ ఫస్ట్ లుక్ రిలీజ్
యశ్ టాక్సిక్ నుంచి ఆదివారం ఓ స్పెషల్ అప్‌డేట్ వచ్చేసింది. హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Dec 21, 2025, 12.13 pm IST
Kiara Advani | కేజీఎఫ్, కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్స్‌తో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయారు యశ్ (Yash). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. అత్యధిక వసూళ్లను రాబట్టిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచాయి.
కేజీఎఫ్, కేజీఎఫ్ 2తో యశ్‌కు బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అతడితో సినిమాలు చేసేందుకు వివిధ భాషలకు చెందిన టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు రెడీ అయ్యారు. కేజీఎఫ్ సినిమాలతో వచ్చిన క్రేజ్‌ను నిలుపుకునే ప్రయత్నాల్లో ఉన్న యశ్ కథల విషయంలో చాలా సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్నారు.
కేజీఎఫ్ 2 తర్వాత మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌తో టాక్సిక్ మూవీ చేస్తున్నారు యశ్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ కన్నడంతో ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. టాక్సిక్ మూవీ నుంచి ఇప్పటివరకు యశ్ పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. తాజాగా స్పెషల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్.
మోడ్రన్ లుక్‌లో
ఆదివారం టాక్సిక్ నుంచి కియారా అద్వానీ (Kiara Advani ) ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మోడ్రన్ లుక్‌లో ర్యాంప్ వాక్ చేస్తూ కియారా అద్వానీ స్టైలిష్‌గా కనిపిస్తోంది. రెట్రో స్టైల్‌లో పోస్టర్‌ను డిజైన్ చేయడం ఆసక్తిని పంచుతోంది. టాక్సిక్‌లో నదియా అనే పాత్రలో కియారా కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కియారా అద్వానీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాక్సిక్ మూవీతోనే కియారా అద్వానీ కన్నడంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీలో కియారా అద్వానీతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హ్యూమా ఖురేషితో పాటు టోవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యశ్ టాక్సిక్ మూవీ మార్చి 19న కన్నడ, ఇంగ్లీష్‌తో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. మార్చి 19న టాక్సిక్‌తో పాటు ధురంధర్ 2, అడివి శేష్ డెకాయిట్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టాక్సిక్ రిలీజైన వారం తర్వాత నాని ప్యారడైజ్‌తో పాటు రామ్‌చరణ్ పెద్ది థియేటర్లలోకి రానున్నాయి. ఈ పాన్ ఇండియన్ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






