Khushbu | కూతురి పెళ్లి ఫొటోలపై విమర్శలు – నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి ఇటీవల గోవాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకల తాలూకు మధుర క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దిగ్గజ దర్శకుడు భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో ఉన్న టైమ్‌లో ఖుష్బూ పెళ్లి ఫొటోలు పోస్ట్ చేయడంపై కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది ఖుష్బూ.
Entertainment | Published On Jun 28, 2026, 2.27 pm IST
Khushbu | దక్షిణాది సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. గోవాలోని ఓ రిస్టార్ట్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో తెలుగు, తమిళం, మలయాళ , కన్నడ భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌తో పాటు మరికొందరు స్టార్స్ పెళ్లికి అటెండ్ అయ్యారు. హీరోయిన్లు త్రిష, తమన్నా ఈ పెళ్లి వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అవసరమా...
కూతురు పెళ్లి వేడుకల తాలూకు ఫొటోలను ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో కూతురు అవంతిక, అల్లుడు శ్రవణ్‌తో పాటు ఖుష్బూ , ఆమె భర్త డైరెక్టర్ సుందర్ సి సంతోషంగా కనిపిస్తున్నారు. భాగ్యరాజ్ హఠాన్మరణంతో తమిళ సినీ పరిశ్రమ మొత్తం షాక్‌లో ఉంది. అలాంటి టైమ్‌లో ఖుష్బూ పెళ్లి ఫొటోలు పోస్ట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయిందని, ఇలాంటి టైమ్‌లో ఈ పోస్ట్‌లు అవసరమా అంటూ ఖుష్బూ పోస్ట్‌పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆనందాన్ని దూరం చేయద్దు
ఆ నెటిజన్ కామెంట్స్‌పై ఖుష్బూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. . "నా కూతురు పెళ్లి జరిగి నలభై ఎనిమిది గంటలు కూడా కాలేదు. ఇలాంటి చవకబారు కామెంట్లతో ఆ ఆనందాన్ని మాకు దూరం చేయద్దు. విమర్శించడానికే నన్ను ఫాలో అవుతున్నావా?. నా పోస్ట్‌లు ఇబ్బందిగా అనిపిస్తే ఫాలో కావడం మానేయ్. మీ లాంటి వాళ్లు అన్‌ఫాలో చేసినా నాకు వచ్చే నష్టమేమీ లేదు. నా సంతోషాన్ని కాదనే హక్కు మీకు లేదు" అంటూ ఖుష్బూ ఫైర్ అయ్యింది. "భాగ్యరాజ్ కుటుంబంతో పాటు పూర్ణిమ గురించి మీకంటే నాకే బాగా తెలుసు. మీ సలహాలు అవసరం లేదు" అంటూ ఖుష్బూ రిప్లై ఇచ్చింది. ఆమె కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
పెళ్లిలో భాగ్యరాజ్...
గోవాలో జరిగిన ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకకు భాగ్యరాజ్ హాజరయ్యారు. పెళ్లి వేడుకలో చిరంజీవితో పాటు ఇతర సీనియర్ హీరోలతో భాగ్యరాజ్ ముచ్చటిస్తోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్లి జరిగిన తర్వాత రోజే భాగ్యరాజ్ మరణించడం అభిమానులను బాధకు గురిచేస్తోంది. ఆ బాధలో ఉండగానే ఖుష్బూ పెళ్లి ఫొటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సీనియర్ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా వేదికగా భాగ్యరాజ్‌కు నివాళులర్పించారు. ఆయన ఫోటోను షేర్ చేస్తూ.. "మీతో గడిపిన సంతోషక్షణాలు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం" అని ఖుష్బూ పేర్కొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sharmiela Mandre | తమిళ నిర్మాతతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్ – ఫొటోలు వైరల్
జూన్ 28, 2026

Kollywood | భాగ్యరాజ్‌కు నివాళులు అర్పించిన సీఎం విజయ్ – కళ్లను దానం చేసిన దిగ్గజ దర్శకుడు
జూన్ 27, 2026

Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మల సందడి
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు
- ●Jangaon | నష్కల్‌లో మద్యం విక్రయం.. విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్
- ●Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ - రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో
- ●KTR | 12 లక్షల చెట్లు నరికేసి.. వికారాబాద్ అడవులకు ఉరి వేసే ప్రయత్నం : కేటీఆర్
- ●Muharram Procession Poison | కనీసం 15 వేల మందిని చంపాలనుకున్నా.. ముంబై పోలీసులకు చెప్పిన నిందితుడు
- ●Harish Rao | రేవంత్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?

CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు

Jangaon | నష్కల్‌లో మద్యం విక్రయం.. విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్

Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ - రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో

KTR | 12 లక్షల చెట్లు నరికేసి.. వికారాబాద్ అడవులకు ఉరి వేసే ప్రయత్నం : కేటీఆర్



