త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Muharram Procession Poison | కనీసం 15 వేల మందిని చంపాలనుకున్నా.. ముంబై పోలీసులకు చెప్పిన నిందితుడు

ముంబై మొహర్రం ఊరేగింపులో పెయిన్ కిల్లర్స్ పేరుతో విషపు మాత్రలు పంచుతూ పట్టుబడ్డ వ్యక్తి. 15 వేల మంది ప్రాణాలు తీసేందుకు పన్నిన ఈ కుట్ర వెనుక అసలు నిజాలివే!

J

Crime | Published On Jun 28, 2026, 4.14 pm IST

Muharram Procession Poison | కనీసం 15 వేల మందిని చంపాలనుకున్నా.. ముంబై పోలీసులకు చెప్పిన నిందితుడు
Advertisement
  • ముంబైలోని బైకుల్లాలో మొహర్రం ఊరేగింపులో పెయిన్ కిల్లర్స్ అని నమ్మించి ఎలుకల మందు (Zinc Phosphide) మాత్రల పంపిణీ 
  • 50 కిలోల విషం, 30,000 క్యాప్సూల్స్ ఆర్డర్ చేసిన నిందితుడు
  • 15,000 మందిని చంపడమే తన లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడి
  • దీన్ని ఒక 'పుణ్యకార్యం' (Noble deed) గా నమ్మించి, ఇతరుల ద్వారా కూడా ఈ విషపు మాత్రలను పంపిణీ చేయించిన ఫయాజ్
  • పుణెకు చెందిన నిందితుడు, భార్య విడాకులు ఇవ్వడంతో మానసిక సమతుల్యత కోల్పోయాడని చెబుతున్న స్థానికులు

Muharram Procession Poison | త్రినేత్ర.న్యూస్ : ముంబై (Mumbai) లోని బైకుల్లా ప్రాంతంలో జరిగిన మొహర్రం ఊరేగింపులో ఒక భయంకరమైన కుట్ర వెలుగుచూసింది. ఇమ్యూనిటీ బూస్టర్లు, పెయిన్ కిల్లర్స్ (Painkillers) పేరుతో ఏకంగా 15,000 మందిని పొట్టనబెట్టుకోవాలని చూసిన ఫయాజ్ ప్రేమ్‌జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాలు కాపాడే మందుల రూపంలో జనాలకు విషాన్ని పంచుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఈ వ్యక్తి నేపథ్యం పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది.

15 రోజుల స్కెచ్.. 'పుణ్యకార్యం' పేరుతో మోసం

విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ దారుణాన్ని ఒక 'పుణ్యకార్యం' (Noble deed) గా అతడు నమ్మించాడు. ఒక్కడు ఇంతమందికి మాత్రలు పంచడం సాధ్యం కాదని.. ఆ పుణ్యంలో పాలుపంచుకోమని స్థానికంగా ఉండే మరికొందరి సహాయం కూడా తీసుకున్నాడు. ఇందుకోసం ఏకంగా 30 వేల క్యాప్సూల్స్, 50 కిలోల ఎలుకల మందు (Zinc Phosphide) ను ఆర్డర్ చేశాడు. పుణె నుంచి 15 రోజుల క్రితమే ముంబై వచ్చిన ఫయాజ్.. డోంగ్రీలోని సన్ డార్మిటరీ (Sun Dormitory) హోటల్‌లో మకాం వేసి ఈ టాక్సిక్ పిల్స్ (Toxic pills) తయారు చేశాడు.

Mumbai Muharram Poison Plot Man Arrested for Distributing Toxic Pills

ఆ ముగ్గురు మహిళల అప్రమత్తతతో తప్పిన ముప్పు

నిందితుడి వద్ద నుంచి సుమారు 14,900 మాత్రలను పోలీసులు సీజ్ చేశారు. ఈ మాత్రలు మింగిన సల్మాన్ సయ్యద్, అలీ అబ్బాస్ సయ్యద్‌తో సహా 11 మంది అప్పటికే అస్వస్థతకు గురయ్యారు. కొందరు మహిళలైతే విటమిన్ సప్లిమెంట్లు అనుకుని తమ పిల్లలకు కూడా ఇవి తినిపించారు. అయితే, అక్కడ ఉన్న ముగ్గురు మహిళా వాలంటీర్లకు అనుమానం వచ్చి ఒక క్యాప్సూల్‌ను తెరిచి చూడగా, లోపల పౌడర్ కనిపించింది. వెంటనే వారు లౌడ్ స్పీకర్లలో అనౌన్స్‌మెంట్ చేసి పంపిణీని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మానసిక స్థితి కోల్పోయిన ఫయాజ్?

ఫయాజ్ స్వస్థలం పుణెలోని విమాన్ నగర్. అతడి తల్లి, సోదరి ఇరాన్‌లో ఉంటున్నారు. తండ్రికి పెయింట్ ఫ్యాక్టరీ ఉంది. 2019-2025 మధ్య కాలంలో అతడు సుమారు 19 సార్లు ఇరాన్, ఇరాక్ దేశాలకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. అయితే, అతడి భార్య విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అప్పటినుంచి అతడు మానసిక సమతుల్యత కోల్పోయాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.

ప్రస్తుతం ఫయాజ్‌పై బైకుల్లా పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశారు. ఈ కుట్ర వెనుక మరెవరైనా మాస్టర్ మైండ్స్ ఉన్నారా? దీనికి ఉగ్రవాద సంస్థలతో (Terror links) ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement