KTR | 12 లక్షల చెట్లు నరికేసి.. వికారాబాద్ అడవులకు ఉరి వేసే ప్రయత్నం : కేటీఆర్
KTR | మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే 12 లక్షల చెట్లను నరికేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి మూసీ నదికి, వికారాబాద్ అడవులకు, భవిష్యత్ తరాలకు ఉరివేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే 12 లక్షల చెట్లను నరికేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి మూసీ నదికి, వికారాబాద్ అడవులకు, భవిష్యత్ తరాలకు ఉరివేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వికారాబాద్ అడవుల్లో 12 లక్షల చెట్లు నరికేసి దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కడతామంటే నాడు కేసీఆర్ ఒప్పుకోలేదు. కానీ నేడు మోదీ ఒక్క మాట అడగగానే, బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి 2,900 ఎకరాలు అప్పగించారు. వికారాబాద్ అభివృద్ధికి నాడు కేసీఆర్ కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, ఆస్పత్రులు నిర్మించారు. వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతాంగానికి సాగునీరు అందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి, కాంగ్రెస్ ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పనులు పూర్తి చేశాం. రిజర్వాయర్లన్నీ పూర్తయి కేవలం పంపులు నడపడమే మిగిలి ఉన్నా, ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేస్తే ప్రజలు కేసీఆర్‌ను గుర్తుంచుకుంటారనే ఒకే ఒక్క ఈర్ష్యతో ఈ రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కనబెట్టేసింది. కాంగ్రెస్ నీచ రాజకీయాల వల్ల రంగారెడ్డి జిల్లా రైతాంగానికి నీళ్లు అందకుండా ద్రోహం చేస్తున్నారు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
భూములన్నీ అనుముల బ్రదర్స్ బుక్కేస్తున్నారు
నాడు బీఆర్ఎస్ పాలనలో వికారాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటే.. నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములన్నీ అనుముల బ్రదర్స్ బుక్కేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణా రెడ్డి నలుగురు నాలుగు దిక్కులా తిరిగి వికారాబాద్ భూములను మింగేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఛిద్రం చేసిందని వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజమెత్తారు.
అబద్ధాలు ఆడితే మీ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదు
గడ్డం ప్రసాద్ గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ అప్పులు చేసి పోయాడని అబద్ధాలు చెబుతున్నాడు. స్పీకర్ మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి అబద్ధాలు ఆడితే మీ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదు. RBI, CAG వద్ద నుండి లెక్కలు తీసుకొని, 10 ఏండ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80 వేల కోట్లని నిండు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కానీ స్పీకర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని చెబుతాడు, ఇంకొకైన రూ. 9 లక్షల కోట్లు అంటాడు. ఇంకొకైన రూ. 10 లక్షల కోట్లు అని, నోటికి ఎంత వస్తే అంత చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ధృతరాష్ట్రుడిలా స్పీకర్
తెలంగాణలో స్పీకర్ ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినా, అందులో ఒకరు కాంగ్రెస్ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినా స్పీకర్ గారికి ఏమీ పట్టట్లేదు అని కేటీఆర్ దుయ్యబట్టారు.
తాజావార్తలు
- ●Green Hydrogen Train | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..! త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
- ●Harish Rao | చిర్ర గోనె ఆడిన హరీశ్‌రావు.. ఫొటోలు వైరల్
- ●Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ - నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
- ●MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..
- ●Revanth Reddy | నల్గొండలో మహత్తర ఘట్టం.. హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం
- ●Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ

Green Hydrogen Train | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..! త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

Harish Rao | చిర్ర గోనె ఆడిన హరీశ్‌రావు.. ఫొటోలు వైరల్

Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ - నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్

MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..





