Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ హీరోగా నటించిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ హ్యాంగ్‌మ్యాన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 3 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. రెమ్యూనరేషన్ లేకుండా ఉచితంగా బ్రహ్మాజీ ఈ సినిమాలో నటించారట.
Entertainment | Published On Jun 28, 2026, 4.29 pm IST
Telugu OTT | టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కెరీర్ హీరోగానే మొదలైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరంలో మెయిర్ హీరోగా నటించాడు. ఆ తర్వాత గణా, చిరంజీవులుతో పాటు మరికొన్ని సినిమాల్లో కథానాయకుడిగా కనిపించాడు. హీరోగా సక్సెస్ కాలేకపోయిన బ్రహ్మాజీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పిస్తోన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ బ్రహ్మాజీ మళ్లీ హీరోగా ఓ సినిమా చేశాడు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి రాబోతుంది.
సన్ నెక్స్ట్‌లో...
బ్రహ్మాజీ హీరోగా నటించిన హ్యాంగ్‌మ్యాన్ మూవీ జూలై 3న సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల అవుతోంది. హ్యాంగ్‌మ్యాన్ మూవీకి విహాన్ దర్శకత్వం వహించాడు. ఈ తెలుగు మూవీలో బ్రహ్మాజీతో పాటు వినయ్, పల్లె సన్నీ, బన్నీ అభిరామ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
తలారిగా...
హ్యాంగ్‌మ్యాన్ మూవీలో బ్రహ్మాజీ.... తలారి శివయ్య అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఖైదీలను ఉరి తీసేటప్పుడు తలారిలు ఎలాంటి సంఘర్షణకు లోనవుతారు? ఈ వృత్తి కారణంగా సమాజంలో వారికి ఎదురయ్యే అవహేళనలు, అవమానాల చుట్టూ ఈ థ్రిల్లర్ మూవీ సాగనున్నట్లు సమాచారం. హ్యాంగ్‌మ్యాన్ రన్‌టైమ్ కూడా తక్కువేనట. కేవలం గంట ఇరవై నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
రెమ్యూనరేషన్ లేకుండా...
హ్యాంగ్‌మ్యాన్ కథ నచ్చి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా బ్రహ్మాజీ ఈ సినిమాలో ఉచితంగా నటించారట. ఆయన నటన ఈ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. 2020లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు ఆరేళ్ల తర్వాత హ్యాంగ్‌మ్యాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడిగా విహాన్‌కు ఇదే డెబ్యూ మూవీ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? – రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
జూన్ 28, 2026

Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ – నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
జూన్ 28, 2026

Pooja Hegde | పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్‌లో బుట్టబొమ్మ – అప్పుడు ఛాన్స్ మిస్ – ఇప్పుడు జాక్‌పాట్
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
- ●PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం
- ●Green Hydrogen Train | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..! త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
- ●Harish Rao | చిర్ర గోనె ఆడిన హరీశ్‌రావు.. ఫొటోలు వైరల్
- ●Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ - నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
- ●MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..

Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?

PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం

Green Hydrogen Train | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..! త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

Harish Rao | చిర్ర గోనె ఆడిన హరీశ్‌రావు.. ఫొటోలు వైరల్



