త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jangaon | న‌ష్క‌ల్‌లో మ‌ద్యం విక్ర‌యం.. విద్యుత్ క‌నెక్ష‌న్లు తొల‌గించిన స‌ర్పంచ్

Jangaon | ఇప్ప‌టికీ తెలంగాణ‌లోని ప‌లు గ్రామాల్లో మ‌ద్యానికి వ్య‌తిరేకంగా పోరాటాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. కొన్ని గ్రామాలు స్వ‌చ్ఛందంగా మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేస్తున్నాయి. మ‌రికొన్ని గ్రామాలు మ‌ద్య‌పాన నిషేధం కోసం తీర్మానాలు చేసిన‌ప్ప‌టికీ.. దొడ్డిదారిన కొంద‌రు విక్ర‌యాలు చేస్తున్నారు.

S

Telangana | Published On Jun 28, 2026, 4.37 pm IST

Jangaon | న‌ష్క‌ల్‌లో మ‌ద్యం విక్ర‌యం.. విద్యుత్ క‌నెక్ష‌న్లు తొల‌గించిన స‌ర్పంచ్
Advertisement

Jangaon | త్రినేత్ర‌.న్యూస్ : ఇప్ప‌టికీ తెలంగాణ‌లోని ప‌లు గ్రామాల్లో మ‌ద్యానికి వ్య‌తిరేకంగా పోరాటాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. కొన్ని గ్రామాలు స్వ‌చ్ఛందంగా మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేస్తున్నాయి. మ‌రికొన్ని గ్రామాలు మ‌ద్య‌పాన నిషేధం కోసం తీర్మానాలు చేసిన‌ప్ప‌టికీ.. దొడ్డిదారిన కొంద‌రు విక్ర‌యాలు చేస్తున్నారు. తాజాగా గ్రామ స‌భ తీర్మానానికి వ్య‌తిరేకంగా మ‌ద్యాన్ని విక్ర‌యిస్తున్న ఆరుగురు ఇళ్ల‌కు స‌ర్పంచ్ విద్యుత్ క‌నెక్ష‌న్లు తొల‌గించి షాకిచ్చారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. జన‌గామ జిల్లా చిల్పూర్ మండ‌ల ప‌రిధిలోని న‌ష్క‌ల్ గ్రామంలో మ‌ద్యం విక్ర‌యించొద్ద‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు గ్రామ‌స‌భ‌లో తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానానికి వ్య‌తిరేకంగా ఓ ఆరుగురు వ్య‌క్తులు మ‌ద్యం విక్ర‌యిస్తున్న‌ట్లు స‌ర్పంచ్ దృష్టికి వ‌చ్చింది. దీంతో స‌ర్పంచ్ శాత‌బోయిన రాజు.. ఆ ఆరుగురి నివాసాల‌కు విద్యుత్ క‌నెక్ష‌న్లు తొల‌గించారు. గ్రామ‌స‌భ‌లో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కే చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు స‌ర్పంచ్ స్ప‌ష్టం చేశారు.

భ‌విష్య‌త్‌లో ఎవ‌రైనా మ‌ద్యం విక్ర‌యించిన‌ట్లు త‌మ దృష్టికి వ‌స్తే.. రేష‌న్ కార్డు, క‌రెంట్, ఇత‌ర సౌక‌ర్యాలు నిలిపివేస్తామ‌ని రాజు హెచ్చ‌రించారు. మద్యం అమ్మేది లేదని బాండు రాసుకొస్తే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక విలువలు ఉన్న గ్రామాన్ని పూర్తిగా మద్యపాన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సర్పంచ్ శాతబోయిన రాజు సారథ్యంలో పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారు.

 

Advertisement
Advertisement