Vijay – Trisha | రచ్చ చేయాల్సిన అవసరం లేదు – విజయ్, త్రిష వ్యవహారంపై ఖుష్బూ రియాక్షన్
దళపతి విజయ్, త్రిష రిలేషన్‌పై తమిళ సీనియర్ నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్, త్రిష వ్యక్తిగత జీవితం వల్ల సమాజానికి వచ్చే నష్టమేమీ లేదని అన్నది. ఈ విషయంలో అంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు చేసింది.
Entertainment | Published On Mar 10, 2026, 9.06 pm IST
Vijay - Trisha | దళపతి విజయ్, త్రిష వ్యవహారంపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న తమిళ సినీ వర్గాలు ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతోన్నారు. కొందరు వీరిద్దరిని విమర్శిస్తోండగా...మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తోన్నారు. అది వారి వ్యక్తిగత విషయమంటూ బదులిస్తున్నారు. తాజాగా విజయ్, త్రిష రిలేషన్‌పై కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ రియాక్ట్ అయ్యింది. వారిద్దరి వ్యవహారంలో అంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదని అన్నది.
నష్టమేమీ లేదు...
"విజయ్, త్రిషలపై ప్రజలు ఎందుకు అంత ఆసక్తిని చూపుతున్నారో అర్థం కావడం లేదు. వారి వ్యక్తిగత జీవితం వల్ల సమాజానికి వచ్చే నష్టమేమీ లేదు. వారి సమస్యలను వారే చక్కదిద్దుకోగలరు" అని ఖుష్బూ అన్నది. త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్‌కు వచ్చే డ్యామేజీ కూడా ఏం లేదని చెప్పింది. ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసునని ఖుష్బూ చెప్పింది. వ్యక్తిగత జీవితం తాలూకు సమస్యల ప్రభావం ఎన్నికలపై ఉంటుందని తాను అనుకోవడం లేదని ఖుష్బూ అన్నది. ఆమె కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
విజయ్ రియాక్షన్...
విడాకులపై దళపతి విజయ్ కూడా ఇటీవల రియాక్ట్ అయ్యాడు. తన జీవితంలో ఎదురైన సమస్యలు చాలా చిన్నవని, మీ సమయాన్ని కేటాయించేంతా ముఖ్యమైనవి కావంటూ అభిమానులతో విజయ్ అన్నారు. విడాకులను చిన్న సమస్యలుగా విజయ్ పేర్కొనడంపై పొలిటికల్ వర్గాలతో పాటు నెటిజన్లు విమర్శిస్తున్నారు.మరోవైపు భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్వరలోనే త్రిషను విజయ్ పెళ్లిచేసుకోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. విజయ్ టీవీకే పార్టీలో త్రిష చేరనున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



