Yash | 24 కోట్లతో ఇళ్లు కొన్న కేజీఎఫ్ హీరో – విరాట్, షారుఖ్ బాటలో రాఖీభాయ్
కేజీఎఫ్ హీరో యశ్ మహారాష్ట్రలో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. 24 కోట్లతో ఓ ఇంటితో పాటు వ్యవసాయ భూమిని కొన్నాడట. అలీబాగ్‌లో విరాట్ కోహ్లి, షారుఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్‌తో పాటు పలువురు సెలిబ్రిటీలకు ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయి.
Entertainment | Published On Jun 5, 2026, 8.49 pm IST
Yash | కేజీఎఫ్ మూవీతో ఓవర్‌నైట్‌లో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ముందు యశ్ కన్నడ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితుడు. కేజీఎఫ్ బ్లాక్‌బస్టర్‌తో తెలుగు, హిందీ తో పాటు పలు భాషల్లో యశ్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
రామాయణలో...
ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ కోసం అన్ని భాషల ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు బాలీవుడ్ మూవీ రామాయణలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలోకి రానున్నాయి.
24 కోట్లతో...
ఈ సినిమాల రిలీజ్ ముంగిట యశ్ ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేశారు. సొంత రాష్ట్రం బెంగళూరులో కాదు. మహారాష్ట్రలో. గత కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లా అలీబాగ్‌లో పలువురు సెలిబ్రిటీలు ల్యాండ్, ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ తో పాటు రణవీర్ సింగ్‌లకు ఇక్కడ కోట్ల విలువ చేసే ఫార్మ్ హౌజ్‌లు ఉన్నాయి. తాజాగా అలీభాగ్‌లో యశ్ కూడా ఓ ఇంటితో పాటు వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడట. సముద్ర తీరానికి దగ్గరలోని ఈ స్థలాన్ని 24 కోట్లకు యశ్ కొనడం బాలీవుడ్ నాట ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్‌లో ఆఫర్లు పెరగడంతోనే యశ్ అలీబాగ్‌లో భూమిని కొన్నట్లు చెబుతోన్నారు. ముంబై నుంచి గంట లోపే ఇక్కడికి చేరుకోవచ్చట. యశ్‌కు బెంగళూరు ఎనిమిది కోట్ల విలువ చేసే ఇళ్లు ఉంది. కర్ణాటకలో చాలానే భూములు, ఆస్తులు ఉన్నాయి.కేజీఎఫ్, కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్స్‌తో తన రెమ్యూనరేషన్‌ను యశ్ భారీగానే పెంచాడు. రామాయణ సినిమా కోసం వంద కోట్లపైనే యశ్ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ బాలీవుడ్ మూవీకి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగరాజు రాజీనామాపై డీకే రెస్పాన్స్..
- ●CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన
- ●ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు..? ఎంతకీ ఏం జరిగిందంటే..?
- ●CM Revanth Reddy | కేసీఆర్‌కు అసెంబ్లీలోనే క్షమాపణ చెబుతా : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | పాలమూరు జిల్లాలో నీ జెండా ఎగరనివ్వను.. కేసీఆర్‌ను హెచ్చరించిన సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు : సీఎం రేవంత్ రెడ్డి

DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగరాజు రాజీనామాపై డీకే రెస్పాన్స్..

CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన

ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు..? ఎంతకీ ఏం జరిగిందంటే..?

CM Revanth Reddy | కేసీఆర్‌కు అసెంబ్లీలోనే క్షమాపణ చెబుతా : సీఎం రేవంత్ రెడ్డి






