DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగారెడ్డి రాజీనామాపై డీకే రెస్పాన్స్..
DK Shivakumar | కర్నాటక సీనియర్ మంత్రి రామలింగారెడ్డికి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బెంగళూరు అభివృద్ధి శాఖ కేటాయిస్తానని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు.
DK Shivakumar | కర్నాటక సీనియర్ మంత్రి రామలింగారెడ్డికి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బెంగళూరు అభివృద్ధి శాఖ కేటాయిస్తానని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శివకుమార్.. ఈ అంశంపై స్పందించారు. రామలింగారెడ్డికి బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని తాను మాట ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మేరకు జలవనరుల శాఖను ఆయనకు కేటాయించారని, ప్రస్తుతం బెంగళూరు అభివృద్ధి శాఖను కృష్ణ బైరెగౌడకు అప్పగించారని చెప్పారు. “ఈ విషయంలో నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. సాధ్యమైనంత మేరకు కృషి చేశాను. కానీ చివరికి జరిగినది ఇదే. నేను స్వయంగా వెళ్లి రామలింగారెడ్డితో మాట్లాడుతాను” అని శివకుమార్ పేర్కొన్నారు. జలవనరుల శాఖ కూడా అత్యంత ప్రాధాన్యమైన శాఖేనని ఆయన చెప్పారు. రామలింగారెడ్డి తన రాజకీయ జీవితమంతా బెంగళూరుతో ముడిపడి ఉందని, నగర అభివృద్ధికి సంబంధించిన బాధ్యతల్లోనే కొనసాగాలని కోరుకుంటున్నారని వివరించారు.
“ఆయన కోరుతున్న దాంట్లో తప్పేమీ లేదు. ఆయన అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. అయితే పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. హైకమాండ్ అభిప్రాయానికి విరుద్ధంగా ఎవరూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేరు” అని శివకుమార్ స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు తాను వ్యక్తిగతంగా రామలింగారెడ్డిని కలుస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆయన బయటకు వెళ్లారని, తిరిగి వచ్చిన వెంటనే సమావేశమై చర్చిస్తానని చెప్పారు. 2023లో రవాణా శాఖ కేటాయించిన సమయంలో కూడా తాను, తన సోదరుడు డీకే సురేశ్ కలిసి రామలింగారెడ్డిని ఆ బాధ్యతలు స్వీకరించేలా ఒప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే గతంలో సుధాకర్ వద్ద ఉన్న ముజరాయి శాఖను కూడా రామలింగారెడ్డికి అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు.
కాగా, బెంగళూరు అర్బన్ అభివృద్ధి శాఖ విషయంలో ఇచ్చిన హామీని డీకే శివకుమార్ నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం ఉదయం మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తానని, దాన్ని ఆమోదించాలా వద్దా అనేది వారి నిర్ణయమని చెప్పారు. “ఇది కేవలం పదవి విషయం కాదు. ఇది అవమానానికి సంబంధించిన అంశం. ఎంత వరకు భరించాలి? నేను ఇంకా ఏమి చేయాల్సి ఉందో మీరే చెప్పండి” అంటూ రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన అనంతరం రామలింగారెడ్డిని కేటాయించిన శాఖ బాధ్యతలు స్వీకరించేలా ఒప్పించాలని సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఆయన అంగీకరించకపోతే రాజీనామాను ఆమోదించే విషయాన్ని పరిశీలించాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. రామలింగారెడ్డి వ్యవహారం కన్నడ నాట కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాన్ని పార్టీ నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
జూన్ 5, 2026

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
జూన్ 5, 2026

ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు..? ఎంతకీ ఏం జరిగిందంటే..?
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్
- ●BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- ●PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ●Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...
- ●CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన

RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు



