CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన
CM Revanth Reddy | గోదావరి జలాలపై చర్చ చేద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నడు అని సీఎం రేవంత్ అన్నారు. ఎన్ని రోజులు పారిపోతరు.. మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తదని రాష్ట్ర బీజేపీ ఎంపీలను సీఎం రేవంత్ హెచ్చరించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : గోదావరి జలాలపై చర్చ చేద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నడు అని సీఎం రేవంత్ అన్నారు. ఎన్ని రోజులు పారిపోతరు.. మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తదని రాష్ట్ర బీజేపీ ఎంపీలను సీఎం రేవంత్ హెచ్చరించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
గోదావరి జలాల్లో జరిగిన అన్యాయాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతం, కడుగుతం, అవసరమైతే మెడలు వంచైనా గోదావరి జలాల మీద తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడుతాం. కచ్చితంగా బీజేపీ నాయకులు కూడా మీరు తమాషా అనుకుంటున్నరేమో.. మీరు ఎంపీలుగా ఉంటాం అనుకుంటున్నరేమో. గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడుమూతలాడుతున్నారు. చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నడు. ఎన్ని రోజులు పారిపోతరు. మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తది. మర్యాదగా మహారాష్ట్ర సీఎంను చర్చలకు పట్టుకురండి. గోదావరి జలాల మీద తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీరు తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి రైతాంగం కష్టాలు తీర్చడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోదాం. గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకుందాం అని సీఎం అన్నారు.
నువ్వు పోయి సీసాలో తలకాయ పెట్టి సచ్చినా
ఇక కృష్ణా జలాల విషయంలో 60 ఏండ్ల నుంచి రావణకాష్టంలా రగులుతుంది. రాయలసీమ, ఆంధ్రోళ్లతో కొట్లాడాలి. గుంటూరు, గుడివాడతో కొట్లాడాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వద్దా.. పరిష్కారం కావాలంటే చర్చలు జరపాలి. కానీ మనం మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ అడ్డం పడుతడు. వెర్రి మాటలు మాట్లాడుతడు. పగోడితో అయినా, పక్క దేశంతోని అయినా సమస్యలపై పరిష్కారం చేయకుంటే ఎప్పుడైనా ఫలించాయా..? ఓ పెద్ద మనిషితో పంచాయితీ తెంచుకుంటామా లేదా రైతాంగ సోదరులు ఆలోచించాలి. చర్చలు లేకుండా పరిష్కారం జరుగుతదా..? పక్క రాష్ట్రంతో చర్చలు చేస్తానంటే నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. నీవు బురద జల్లినా, తలకిందులు అయినా, నువ్వు పోయి సీసాలో తలకాయ పెట్టి సచ్చినా పక్క రాష్ట్రంతో చర్చలు జరిపి, డిసెంబర్ లోపల పాలమూరు ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు ఒత్తిడి తెచ్చి, ఏపీ నుంచి ఎన్‌వోసీ తీసుకొచ్చి అనుమతి తీసుకువచ్చే బాధ్యత నాది. అదే విధంగా డిండి ప్రాజెక్టుకు 20 నుంచి 30 టీఎంసీలకు అనుమతి తెచ్చే బాధ్యత నాది. ఉద్దండాపూర్ ప్రాజెక్టు పనులను ఏడాది తిరిగే లోపు పూర్తి చేయడమే కాకుండా.. రాబోయే రెండున్నరేండ్లలో జూరాల వద్ద కొత్త రిజర్వాయర్ కట్టుకోవడం కానీ, కర్ణాటక - మక్తల్ సరిహద్దుల్లో బ్రిడ్జి కమ్ బ్యారేజీలు కట్టుకోవడం కానీ అన్ని ప్రాజెక్టులకు గ్రీన్ చానెల్ నిధులు ఇచ్చి పూర్తి చేస్తాం అని సీఎం స్పష్టం చేశారు.
కేసీఆర్ నీకు ఇదే సవాల్
పాలమూరు బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి.. దొంగలు వస్తారు.. దోపిడీదారులు వస్తారు. దొంగలకు సద్దులు మోసెటోళ్లతో జాగ్రతగా ఉండండి. 2024 నుండి 2034 వరకు రాబోయే పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికలలో కేసీఆర్ సంగతి తేలుస్తాం.. కాంగ్రెస్ పార్టీని మళ్లీ రెండోసారి అధికారంలోకి తీసుకువస్తాం. కేసీఆర్ నీకు ఇదే సవాల్. వెనుకబడిన పాలమూరు జిల్లాను రాబోయే రోజుల్లో దేశానికే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్ది, అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను నేనే స్వయంగా తీసుకుంటాను అని పేర్కొంటూ సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్
- ●BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- ●PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ●Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...
- ●DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగారెడ్డి రాజీనామాపై డీకే రెస్పాన్స్..

RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు




