త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పాల‌మూరు జిల్లాలో నీ జెండా ఎగ‌ర‌నివ్వ‌ను.. కేసీఆర్‌ను హెచ్చ‌రించిన సీఎం రేవంత్

CM Revanth Reddy | ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో నీ జెండాను ఎగర‌నివ్వ‌ను అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. జెండాలు దిగాలి.. దిమ్మెలు కూలాలి.. భ‌విష్య‌త్‌లో ఒక్క బీఆర్ఎస్ నాయ‌కుడిని కూడా గెల‌వ‌నివ్వ‌ను అని సీఎం హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Jun 5, 2026, 8.21 pm IST

CM Revanth Reddy | పాల‌మూరు జిల్లాలో నీ జెండా ఎగ‌ర‌నివ్వ‌ను.. కేసీఆర్‌ను హెచ్చ‌రించిన సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో నీ జెండాను ఎగర‌నివ్వ‌ను అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. జెండాలు దిగాలి.. దిమ్మెలు కూలాలి.. భ‌విష్య‌త్‌లో ఒక్క బీఆర్ఎస్ నాయ‌కుడిని కూడా గెల‌వ‌నివ్వ‌ను అని సీఎం హెచ్చ‌రించారు. జ‌డ్చ‌ర్ల‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 22 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాం. ఒక్క మ‌న జిల్లాకే రూ. 8 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాం. నేను ఉన్న‌ప్పుడు కూడా మీకు బుక్కెడు బువ్వ పెట్ట‌కుపోతే.. బాగోద‌ని చెప్పి.. నిధులు విడుద‌ల చేస్తున్నాను అని సీఎం పేర్కొన్నారు.

కొడంగ‌ల్‌లో పెద్ద ఎడ్యుకేష‌న్ క్యాంప‌స్ క‌ట్టుకుంటున్నాం..

జైలు క‌ట్టాల‌ని వారు అనుకుంటే.. ఐఏఎస్, ఐపీఎస్, ప్ర‌జాప్ర‌తినిధులు కావాల‌ని ట్రిపుల్ ఐటీతో పాటు యంగ్ ఇండియా స్కూల్స్, మెడిక‌ల్ కాలేజీలు, న‌ర్సింగ్ కాలేజీలు మంజూరు తెచ్చుకున్నాం. ఇప్పుడు మ‌న కొడంగ‌ల్‌లో పెద్ద ఎడ్యుకేష‌న్ క్యాంప‌స్ క‌ట్టుకుంటున్నామ‌ని సీఎం తెలిపారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకున్న నేను సీఎం స్థాయికి ఎదిగాను..

పెన్ష‌న్లు, ఇండ్లు మ‌న జీవితాల్ని మార్చ‌వు. పిల్ల‌లు చ‌దువుకుంటేనే మ‌నం బాగుప‌డుతాం. డాక్ట‌ర్లు, ఇంజినీర్లు అయితే మ‌న జీవితాల్లో వెలుగులు వ‌స్తాయి. క‌లెక్ట‌ర్, ఎస్పీలు అయితే గౌర‌వం ఉంటుంది. పిల్ల‌ల‌ను చ‌దివించాలి. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకున్న నేను సీఎం స్థాయికి ఎదిగాను. చ‌దువు అత్యంత కీల‌కం. వ‌ల‌స‌లు ఆగాల‌న్నా, రైతులు బాగుప‌డాల‌న్నా.. ఆడ‌బిడ్డ‌లు త‌లెత్తుకుని గౌర‌వంగా బ‌త‌కాల‌న్నా.. పాల‌మూరు జిల్లా సస్య‌శ్యామలం కావాలి.. ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు ఇవ్వాలి.. ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాలంటే ఇందిర‌మ్మ ఇల్లు ఉండాల‌ని సీఎం అన్నారు.

మేం త‌వ్విన గోతిలో మ‌ట్టి తీసుడు కాదు.. పండ‌వెట్టి క‌ప్పుడు కూడా తెలుసు బిడ్డా..

హ‌నుమండ్ల గుడి లేని తండా, ఊరు ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు, తండా ఉండ‌కూడ‌దు.. బీఆర్ఎసోళ్ల‌కు స‌వాల్ విసురుతున్నా.. ఏ ఊర్లో నువ్వు డ‌బుల్ బెడ్రూం క‌ట్టిన‌వో ఆక్కడే ఓట్లు అడ‌గాలి. నేను ఏ ఊర్లో ఇందిర‌మ్మ ఇల్లు క‌ట్టినో ఓటులు అడుగుతా. నీకు డిపాజిట్ వ‌స్తే నా పేరు మార్చుక‌కుంటా.. డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామ‌ని, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇస్తామ‌ని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామ‌ని, ఉద్దండాపూర్‌లో మునిగిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని, నోరు తెరిస్తే అబ‌ద్దాలు చెప్పి, మేం ప‌ని చేస్తుంటే అడ్డం ప‌డి పాల‌మూరు అభివృద్ధిని అడ్డుకుంటావా..? మ‌ట్టి, త‌ట్ట‌, పార‌, ప‌లుగు ప‌ని తెలుసు మా జిల్లా వాళ్ల‌కు. అడ్డం వ‌స్తే నీ ప‌ని కూడా చేస్తాం.. మేం త‌వ్విన గోతిలో మ‌ట్టి తీసుడు కాదు.. పండ‌వెట్టి క‌ప్పుడు కూడా తెలుసు బిడ్డా.. మా జిల్లా ప్ర‌జ‌లు అమ‌యాకులు కాదు.. 2009లో మోసం చేసిన‌ట్టే మ‌ళ్లీ మోసం చేస్తే నిన్ను మొల‌కెత్త‌నివ్వం. పాల‌మూరు జిల్లాలో నీ జెండా ఎగుర‌నివ్వం.. జెండాలు దిగాలి దిమ్మెలు కూలాలి.. భ‌విష్య‌త్‌లో ఒక్క‌రిని కూడా గెల‌వ‌నివ్వ‌ను అని సీఎం హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement